నీటి సంపులో పడి చిన్నారి మృతి

29 Nov, 2023 01:38 IST|Sakshi

హొసపేటె: వాటర్‌ సంపులో పడి ఓ చిన్నారి మృతి చెందిన ఘటన విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా చిక్కజోగిహళ్లి తండాలో మంగళవారం జరిగింది. తండా వాసులు నాగరాజ్‌, కావేరి దంపతుల కుమార్తె విస్మిత(3) తల్లి పెట్టిన గోరు ముద్దలు తిని ఆడుకుంటూ ఇంటి వద్ద ఉన్న సంపులో పడి మృతి చెందింది. ఈ ఘటనతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కూడ్లిగి ఎమ్మెల్యే డాక్టర్‌ ఎన్‌టీ శ్రీనివాస్‌ మృతురాలి ఇంటికి వెళ్లి కుటుంబం సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

కాటే దర్వాజ కమాన్‌

నిర్మించొద్దు

రాయచూరు రూరల్‌: నగరంలోని సూపర్‌ మార్కెట్‌ వద్ద కాటే దర్వాజ కమాన్‌ను నిర్మించడం తగదని ప్రజలు జిల్లాధికారికి ఫిర్యాదు చేశారు. శని, ఆదివారాలు సెలవులు కావడంతో దర్గా నిర్వాహకులు కమాన్‌ నిర్మాణానికి ముందుకొచ్చారు. మంగళవారం పురావస్తు శాఖ, నగరసభ అధికారులు చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శంకరప్ప, బీజేపీ నాయకులు శంకర్‌రెడ్డి, రమానంద్‌ యాదవ్‌, శివ బసప్ప మాలిపాటిల్‌, నాగరాజ్‌ భాల్కి, నరసారెడ్డి డిమాండ్‌ చేశారు. నగరంలో అశాంతిని రేకెత్తించే ఇలాంటి అక్రమ కట్టడ నిర్మాణానికి అవకాశం కల్పించరాదని జిల్లాధికారిని కోరారు.

ఇస్కాన్‌ ఆధ్వర్యంలో శోభాయాత్ర

రాయచూరు రూరల్‌: నగరంలో సోమవారం రాత్రి ఇస్కాన్‌ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ శోభాయాత్రను చేపట్టారు. కార్తీక పున్నమి సందర్భంగా నగరేశ్వర ఆలయం నుంచి మహేశ్వరి సమాజ్‌ అధ్యక్షుడు విఠల్‌దాస్‌ ఇన్నాని శోభాయాత్రను ప్రారంభించారు. పుర వీధుల గుండా సాగిన యాత్రలో రంగుల ముగ్గులతో అలంకరించిన వీధుల్లో భక్తులు సంకీర్తనలు, భజనలు చేసి ప్రజలను మంత్రముగ్ధులను చేశారు. ఆర్యవైఽశ్య నగరేశ్వర మందిర్‌ అధ్యక్షుడు సరతి శ్యాందాస్‌, కేశవరెడ్డి తదితరులున్నారు.

నేత్రదాన సేవలు అనన్యం

రాయచూరు రూరల్‌: మానవ అవయవ దానాల్లో నేత్రదానం ప్రధానమని ఆర్డీసీసీ బ్యాంక్‌ మేనేజర్‌ అమరేష్‌ రాయకోటి అన్నారు. మంగళవారం ఎస్‌కేఈ ప్యారా మెడికల్‌ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మానవుడు మరణించిన తర్వాత కన్నులను దానం చేసి నలుగురి జీవితాలకు వెలుగులు నింపాలన్నారు. సామాజిక భద్రతకు పునాదిరాయిలాంటిదన్నారు. సమావేశంలో గ్రీన్‌ రాయచూరు సంచాలకుడు రాజేంద్ర శివాళే, నవోదయ వైద్యులు జయశ్రీ, ఆదినాయర్‌, అధికారులు విజయలక్ష్మి, గిరీష్‌ ఆచారి, చంద్రశేఖర్‌, బాబూరావ్‌, జీవన్‌ జ్యోతి, అశ్విని, శరణప్పలున్నారు.

జేజేఎం పనులకు శ్రీకారం

కంప్లి: జల్‌జీవన్‌ మిషన్‌(జేజేఎం) పథకం కింద చేపట్టిన పనులు నిర్ణీత సమయంలో నాణ్యతగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ఎస్టీ సోమశేఖర్‌ తెలిపారు. కూడ్లిగి అసెంబ్లీ నియోజకవర్గంలోని తూలహళ్లి గ్రామంలో జలజీవన్‌ మిషన్‌ పథకం ద్వారా ఇంటింటికీ కొళాయిలు ఏర్పాటు చేయడం వల్ల తాగునీటి సమస్య ఎలా ఉన్నా మహిళలు బయటికి వెళ్లకుండా తమ ఇళ్ల ముందే నీటిని నింపుకోగలుగుతారని అన్నారు. కాంట్రాక్టర్‌ వీటిని దృష్టిలో పెట్టుకొని పనులు వీలైనంత త్వరగా నాణ్యతగా పూర్తి చేయాలన్నారు.

మరిన్ని వార్తలు