28 ఏళ్ల నాటి కేసులో నిందితుడి అరెస్ట్‌

29 Nov, 2023 01:38 IST|Sakshi
నిందితుడి మహమ్మద్‌ హొసమని(ఫైల్‌), బెండిగేరి పోలీస్‌ స్టేషన్‌

హుబ్లీ: ఒక కేసులో 28 ఏళ్ల క్రితం జైలుకు వెళ్లి ఆ తర్వాత బెయిల్‌పై విడుదలై కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడిని సోమవారం బెండిగేరి పోలీసులు అరెస్ట్‌ చేశారు. నగరంలోని తారిహళ రోడ్డు నివాసి మహమ్మద్‌ హొసమని(57) నిందితుడు. ఆయన 1995లో నమోదైన కేసులో తప్పించుకొని తిరుగుతున్నాడు. బెండిగేరి సీఐ జయపాల్‌ పాటిల్‌ నేతృత్వంలో బృందం ప్రత్యేకంగా అన్వేషించి నిందితుడిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచారు. కాగా ఈ కేసు మిస్టరీ ఛేదనకు కృషి చేసిన బృందాన్ని పోలీస్‌ కమిషనర్‌ రేణుకా సుకుమార అభినందించారు.

రేపు కనకదాస జయంతి

చెళ్లకెరె రూరల్‌: పట్టణంలో ఈ నెల 30న భక్త కనకదాస 536వ జయంతిని ఘనంగా నిర్వహిస్తామని కురుబ సమాజ నాయకుడు ఆర్‌ మల్లేశప్ప తెలిపారు. ఆయన మంగళవారం కురుబ విద్యార్థి నిలయంలో విలేకరులతో మాట్లాడారు. హాస్టల్‌ ముందు కనకదాస సర్కిల్‌గా నామకరణానికి ఎమ్మెల్యే ద్వారా భూమిపూజ నిర్వహిస్తారన్నారు. అనంతరం కురుబ సమాజం తరఫున కనకదాస చిత్రపటాన్ని ఊరేగిస్తామన్నారు. కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి డీ.సుధాకర్‌, ఎమ్మెల్యే టీ.రఘుమూర్తి హాజరవుతారన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. నగరసభ సభ్యుడు ఎంజే రాఘవేంద్ర, జే.లింగప్ప, రుద్రముని, పూజార్‌ పరుసప్ప, ఎస్‌బీ హనుమంతరాయ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు