అమ్మవారికి గృహలక్ష్మిసొమ్ము

29 Nov, 2023 01:42 IST|Sakshi

మైసూరు: గృహలక్ష్మి పథకం కింద సర్కారు ఐదేళ్ల పరిపాలనలో 50 నెలలకు గాను నగదు సొమ్మును నాడిన శక్తి దేవత అయిన చాముండేశ్వరి అమ్మవారికి మొత్తం రూ. 1,18,000 నగదును ముందుగానే అందజేసింది. ఎన్నికల ప్రచారంలో మొక్కులో భాగంగా అమ్మవారికి కూడా గృహలక్ష్మి పథకాన్ని వర్తింపజేసినట్లు గతంలో సీఎం, డిప్యూటీ సీఎం చెప్పడం తెలిసిందే. 50 నెలల నగదు అధికారులు చాముండేశ్వరి ఆలయ అధికారులకు అప్పగించారు.

బెళగావి అసెంబ్లీ

సమావేశాలకు రూ.25 కోట్లు

కంప్లి: డిసెంబరు 4వ తేదీ నుంచి బెళగావిలోని సువర్ణసౌధలో జరిగే శీతాకాల సమావేశాలకు రూ.25 కోట్లు ఖర్చు చేయనున్నటు పరిషత్‌ సభాపతి బసవరాజ్‌ హొరట్టి తెలిపారు. సణాపుర రోడ్డులోని పీయూ కళాశాలలో ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. ప్రతిసారి శీతాకాల సమావేశాల్లో వివిధ రీతిలో ధర్నాలు, నిరసనలతో కాలయాపన జరిగిందే తప్ప సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ఈసారి సమస్యలపై ఆయా మంత్రుల శాఖల అధికారులకు ప్రభుత్వం తగిన నిర్దేశం చేసి ఎలాంటి ఆందోళనలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. అజెండా ప్రకారం ప్రశ్నోత్తరాలు ముగిసిన అనంతరం డిసెంబర్‌ 5, 6 తేదీల్లో ఉత్తర కర్ణాటక ప్రాంత సమస్యలపై విధాన పరిషత్‌లో చర్చలకు ప్రత్యేక అవకాశం కల్పిస్తామన్నారు.

మరిన్ని వార్తలు