ఆవు పొట్టలో బంగారు చైన్‌

29 Nov, 2023 01:42 IST|Sakshi
గొలుసు మింగి ఆపరేషన్‌కు గురైన గోవు ఇదే

శివమొగ్గ: ఆవు బంగారుచైన్‌ను మింగేసింది. ఇంటి వారి నిర్లక్ష్యం ఆవుకు సంకటంగా మారింది. ఆవుకు ఆపరేషన్‌ చేసి దాని కడుపులో చైన్‌ను బయటకు తీసిన సంఘటన శివమొగ్గ జిల్లాలోని హొసనగర తాలూకా మత్తిమనె గ్రామంలో జరిగింది. వివరాలు.. శ్యామ ఉడుపె అనే వ్యక్తి ఇటీవల దీపావళికి గోపూజ చేసి ఇంట్లోని ఆవుకు ఆ నైవేద్యం సమర్పించారు. అందులో కలశానికి అలంకరించిన 12 గ్రాముల బంగారం చైన్‌ను వారు చూసుకోలేదు. దీంతో ఆవు వంటకాలతో పాటు చైనును కూడా మింగేసింది. కానీ ఆ విషయాన్ని అప్పుడెవరూ గమనించలేదు.

గొలుసు ఏదని గాలింపు

ఇంటిలో ఉన్న బంగారం చైన్‌ కనిపించలేదని అందరూ వెతికినా జాడ లేదు. ఈ మధ్య ఆవు చాలా తక్కువ మేత తినడం చూసి పశువుల వైద్యునికి సమాచారం ఇచ్చారు. కోణందూరుకు చెందిన పశు వైద్యాధికారి డా. ఆనంద్‌ వచ్చి ఆవును పరిశీలించి కడుపులో ఏదో సమస్య ఉందని చెప్పారు. చివరికి అది బంగారు చైన్‌ను మింగినట్లు నిర్ధారించారు. ఈ ఆదివారం రోజున ఆవుకు ఆపరేషన్‌ చేసి కడుపులో ఉన్న బంగారం చైన్‌ను బయటికి తీశారు. రెండు వారాల పాటు బంగారు గొలుసు ఆవు కడుపులో అలాగే ఉండడం విశేషం.

ఆపరేషన్‌ చేసి వెలికితీత

మరిన్ని వార్తలు