అర్ధరాత్రి.. పెద్ద పులి పట్టివేత

29 Nov, 2023 01:42 IST|Sakshi

బంధించిన

పులి ఇదే

మైసూరు: మైసూరు జిల్లాలోని నంజనగూడు తాలూకా పరిధిలో ఉన్న బండీపుర అడవులను ఆనుకుని ఉన్న ప్రాంతంలో సంచరిస్తూ ప్రజలను భయానికి గురిచేస్తూ, ఇటీవల పశువులను మేపుతున్న ఒక మహిళను బలితీసుకున్న పెద్ద పులిని అటవీ సిబ్బంది హెడియాల గ్రామం సమీపంలో పట్టుకున్నారు. పులికి తుపాకీతో మత్తు ఇంజెక్షన్‌ ఇవ్వడంతో అది మత్తులోకి జారుకోగా పట్టుకుని బంధించారు.

ఈ నెల 24న హెడియాల వద్ద పశువులు మేపుతున్న రత్నమ్మ (55)ని పులి చంపి భక్షించింది. అలాగే రెండు ఆవులను బలితీసుకుంది. దీంతో పరిసర పల్లెల ప్రజలు పొలాలకు వెళ్లాలంటే భయపడేవారు. చుట్టుపక్కల గాలింపు ప్రారంభించిన అటవీ సిబ్బంది పగలూ రాత్రి శ్రమించారు. రెండు ఏనుగులు, వందమందికి పైగా అటవీ సిబ్బంది, డ్రోన్‌ కెమెరాలతో కార్యాచరణ చేపట్టారు. సోమవారం అర్ధరాత్రి సుమారు 1.45 గంటల సమయంలో పదేళ్ల వయసున్న మగ పులిని చూశారు. దానిని వెంబడించి తుపాకీతో మత్తు సూదిని కొట్టారు. కొంతసేపటికి అది మత్తులో పడిపోగా, బంధించి మైసూరు నగరంలో ఉన్న చామరాజేంద్ర జూకి తరలించారు. పులి పీడ విరగడ కావడంతో పరిసర పల్లెల ప్రజలు హమ్మయ్య అనుకున్నారు.

మైసూరు జిల్లాలో

కార్యాచరణ విజయవంతం

ఇటీవల ఒక మహిళను చంపిన పులి

మరిన్ని వార్తలు