మా ప్రకటనల్లో తప్పేం లేదు: డీకే

29 Nov, 2023 01:42 IST|Sakshi

యశవంతపుర: తమ ప్రభుత్వం సాధించిన విషయాలను మాత్రమే తాము తెలంగాణ పత్రికలకు ప్రకటనలు ఇచ్చాము తప్పా ఎన్నికలలో ఓట్లు అడగడానికి కాదని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ తెలిపారు. ఆయన మంగళవారం నగరంలో నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో తెలుగు పత్రికలలో కర్ణాటక ప్రభుత్వం ఇస్తున్న గ్యారంటీ పథకాల ప్రకటనలపై ఎన్నికల కమిషన్‌ నోటీసులు జారీ చేయడంపై ఈ మేరకు స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీకి గానీ, అభ్యర్థికి గానీ ఓటు వేయాలని తాము ఆ ప్రకటనల్లో అడగలేదన్నారు. ఇదీ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన ఎలా అవుతుందని అన్నారు. నోటీసులకు సమాధానం ఇస్తామన్నారు. చట్టం ప్రకారం తెలంగాణ పత్రికలకు ప్రకటనలు ఇస్తే ఈసీ నోటీసులివ్వటం సరికాదని కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ సుర్జేవాలా అన్నారు. బెంగళూరులో మాట్లాడుతూ ఐదు రాష్ట్రాల ఎన్నికలలో కాంగ్రెస్‌ విజయం తథ్యమన్నారు.

మరిన్ని వార్తలు