బిడ్డ మృతదేహాన్ని వదిలేశారు

7 Dec, 2023 00:14 IST|Sakshi
చిన్నారి తల్లిదండ్రులు విభాకుమారి, ప్రమేశ్‌

దొడ్డబళ్లాపురం: రెండు రోజుల క్రితం దొడ్డ తాలూకా బాశెట్టిహళ్లిలోని పారిశ్రామికవాడలో మురుగు కాలువ పక్కన లభించిన చిన్నారి మృతదేహం కేసులో తల్లిదండ్రులే బాధ్యులని పోలీసులు గుర్తించారు. వివరాలు.. వారం కిందటే ప్రమేశ్‌, విభాకుమారి అనే దంపతులు కూలీ పనుల కోసం బిహార్‌ నుంచి వచ్చారు. వారికి 16 నెలల పాప రుచి ఉంది. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతుండేది. బాశెట్టిహళ్లిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చూపించినా చికిత్స ఫలించక చిన్నారి మృతిచెందింది. డబ్బు లేక, ఎవరూ తెలియని ఊరిలో శవ సంస్కారం ఎలా చేయాలో తెలియక పాప శవాన్ని డ్రైనేజీ పక్కన పెట్టేసి జారుకున్నారు.

తాయత్తు పట్టించింది

పాపమెడలో ఉన్న తాయత్తు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అలాంటి తాయత్తును ఉత్తర భారతదేశానికి చెందిన వారే ధరిస్తారని తెలిసి వలస కూలీల కోసం గాలింపు జరిపారు. చివరకు తల్లితండ్రులను గుర్తించి కేసు నమోదు చేశారు.

వలస కూలీ దంపతులపై కేసు

>
మరిన్ని వార్తలు