ఆస్తి కోసం ఘాతుకం

20 Feb, 2024 08:21 IST|Sakshi

మైసూరు: ఆస్తి గొడవలతో రెండవ భార్యను మొదటి భార్య పిల్లలతో కలిసి హత్య చేశాడో భర్త, ఈ దారుణం మైసూరులోని ఎన్‌ఆర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. మృతురాలు అఖిలా బాను (46). వివరాలు.. ఆమె భర్త అబ్బథాయుబ్‌ సిల్క్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తుంటాడు. అతనికి మొదటి భార్య, ఆమె కుమారులు అయిన మొహమ్మద్‌ అసిఫ్‌, థోసిఫ్‌, హైదర్‌లు ఉన్నారు. అబ్బాథాయూబ్‌ 2013లో అఖిలా బానును రెండవ పెళ్లి చేసుకున్నాడు.

ఈమెకు సంతానం లేదు, ఇటీవల క్యాన్సర్‌ జబ్బు కూడా వచ్చింది. అఖిలా బాను కోసం ఆమె అక్క కొడుకు నాయుడు నగరలో ఒక ఇంటిని కొని ఇచ్చాడు. ఈ ఇంటిలో అఖిలా భాను, భర్తతో కలిసి ఉంటోంది. ఇటీవల మొదటి భార్య కొడుకులు కూడా ఈ ఇంటికి వస్తున్నారు. ఈ విషయంలో అఖిల, భర్త మధ్య గొడవలు జరిగాయి. ఈ నెల 16వ తేదీన ఉదయం అఖిల చనిపోయిందని భర్త అబ్బాథాయుబ్‌ విలపిస్తూ బంధువులకు చెప్పాడు. ఆమె గొంతుపై గాయాలు ఉండడం చూసి ఇది సహజ మరణం కాదని, హత్య అని బంధువులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రాథమిక విచారణ తరువాత భర్త, ముగ్గురు కొడుకులను అరెస్టు చేశారు.

whatsapp channel

మరిన్ని వార్తలు