ప్రేమ పేరుతో నయవంచన

22 Feb, 2024 01:28 IST|Sakshi
ప్రేమ జంట

రాయచూరు రూరల్‌: ప్రేమ పేరుతో నయ వంచన చేసి ప్రేమించిన అబ్బాయిని మోసగించి మరొకరితో ప్రేమాయణం సాగించిన ఓ యువతి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు...రాయచూరులోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో నిర్మల అనే యువతి నర్సుగా పని చేస్తుండేది. అదే ఆస్పత్రిలో రాజశేఖర్‌ అనే యువకుడు ల్యాబ్‌ టెక్నిషియన్‌గా 2021 నుంచి పని చేసేవాడు. ముందుగా యువకుడిని ఆమె ప్రేమించింది.

ఆ తర్వాత బెంగళూరులో మరొకరిని ప్రేమించడమేగాక తన వద్ద నుంచి రూ.5 లక్షల వరకు డబ్బులు తీసుకుందని, జనవరి 1న ఊరుకెళుతున్నానని చెప్పి పరారై తనను మోసం చేసిందంటూ ఈనెల 15న మార్కెట్‌ యార్డు పోలీస్‌ స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశాడని సీఐ నాగరాజ్‌ వెల్లడించారు.

whatsapp channel

మరిన్ని వార్తలు