ప్రేమ పేరుతో యువతికి సంకటం

24 Feb, 2024 09:05 IST|Sakshi

యశవంతపుర: ప్రేమించి పెళ్లి చేసుకొంటానంటూ నమ్మించి యువతి జీవితాన్ని భగ్నం చేశాడో వంచకుడు. బెళగావి జిల్లా కిత్తూరు పట్టణంలో ఈ సంఘటన జరిగింది. నేకార కాలనీకి చెందిన ముత్తురాజ్‌ ఇటగి.. పక్క ఇంటిలోని యువతిని ఆరేళ్ల నుంచి ప్రేమిస్తున్నాడు. తమ తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదంటూ ముత్తురాజ్‌ ఆమెకు ముఖం చాటేశాడు. దీంతో యువతి తల్లిదండ్రులు కొద్దిరోజుల క్రితం ఖానాపుర తాలూకాకు చెందిన యువకునితో వివాహం చేశారు.

అయితే ముత్తురాజు ఆ యువకున్ని కలిసి తామిద్దరూ ప్రేమికులని పాత ఫొటోలను చూపించాడు. దీంతో యువతి భర్త పెద్ద గొడవ చేసి ఆమెను పుట్టింట్లో వదిలిపెట్టి వెళ్లిపోయాడు. యువతి జీవితంతో ఆటలాడుతున్న ముత్తురాజ్‌ ఇంటి వద్ద బాధిత యువతి, తల్లిదండ్రులు బంధువులు ధర్నా చేసి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఆమెను ముత్తురాజ్‌ పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టారు. కిత్తూరు పోలీసులకు యువతి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అరోపణలు వస్తున్నాయి.

whatsapp channel

మరిన్ని వార్తలు