ప్రధానోపాధ్యాయుడి కష్టాలు.. పని చేస్తున్న స్కూల్లోనే నైట్‌ డ్యూటీలు

6 Jul, 2021 08:56 IST|Sakshi
పాఠశాలలో నిద్రిస్తున్న ప్రధానోపాధ్యాయుడు

రాయచూరు: మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన సరుకులు దొంగలపాలు కాకుండా ప్రధానోపాధ్యాయుడు కాపలా కాయాల్సిన దుస్థితి యాదగిరి జిల్లాలో వెలుగు చూసింది. వివరాలు.. యాదగిరి జిల్లా సురపుర తాలూకా మాలహళ్లిలోని పాఠశాలలో 1నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు సంబంధించిన బియ్యం, బేడలు, ఇతర నిత్యావసరాలను పాఠశాలలోనే నిల్వ చేశారు. ఇటీవల చుట్టు పక్కల ప్రాంతాల్లో చోరీలు జరుగుతున్నాయి. దీంతో సరుకులను కాపాడుకునేందుకు ప్రధానోపాధ్యాయుడే రోజూ రాత్రి పాఠశాలకు వెళ్లి గదికి తాళం వేసి అక్కడే నిద్రిస్తున్నాడు.  

Read latest Karnataka News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు