కరోనా మృత్యుకాటు: కొత్తగా 529 మంది మృతి

25 May, 2021 09:15 IST|Sakshi

మరో 529 మరణాలు

కొత్తగా 25,311 పాజిటివ్‌లు

57,333 మంది డిశ్చార్జి

సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో కరోనా మారణహోమం కలకలం సృష్టిస్తోంది. గత 24 గంటల్లో కేసులు మరింత తగ్గి 25,311 పాజిటివ్‌లు నమోదయ్యాయి. మరోవైపు 57,333 మంది కోలుకున్నారు. అయితే మరణ మృదంగం గుబులు పుట్టిస్తూ 529 మంది మృత్యువాత పడ్డారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 24,50,215 కి పెరిగింది. ఇప్పటివరకు 19,83,948 మంది డిశ్చార్జి అయ్యారు. 25,811 మంది కన్నుమూశారు. 4,40,435 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. 

బెంగళూరులో తగ్గిన కేసులు..

  • బెంగళూరులో కరోనా కేసులు భారీగా తగ్గిపోవడం నగరవాసులకు శుభవార్త. తాజాగా 5,701 పాజిటివ్‌లు, 34,378 డిశ్చార్జిలు, 297 మరణాలు నమోదయ్యాయి.  
  • ఇప్పటికి మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,25,253 కు పెరిగింది. ఇప్పటికి 8,86,871 మంది కోలుకున్నారు. ప్రాణనష్టం 11,513 కి పెరిగింది.  
  • ప్రస్తుతం 2,26,868 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.  
  • లక్ష మందికి టీకా  
  • కొత్తగా 1,07,562 మందికి కరోనా టీకా ఇచ్చారు. మొత్తం టీకాల సంఖ్య 1,21,97,196కు పెరిగింది. మైసూరులో 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు టీకా ఇవ్వడం మొదలైంది. యువత ఉత్సాహంగా టీకా తీసుకున్నారు.  
  • మరో 1,08,723 మందికి కరోనా టెస్టులు చేశారు. మొత్తం పరీక్షలు 2.88 కోట్లను దాటాయి.  
Read latest Karnataka News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు