కరోనా మరణాల లెక్కలు.. కలెక్టర్‌ వర్సెస్‌ ఎమ్మెల్యే

1 Jun, 2021 20:38 IST|Sakshi

మైసూరు(కర్ణాటక): కోవిడ్​ బారినుంచి ప్రజలను రక్షించడమే తమ కర్తవ్యమని, ఇతరులు ఎలాంటి ఆరోపణలు చేసినా తాను సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని మైసూర్​ కలెక్టర్​ రోహిణి సింధూరి అన్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మైసూరు, కొడగు ఎంపీ ప్రతాప్​సింహ కోవిడ్​ కు సంబంధించిన వివరాలు బహిరంగంగా అడగటం వల్లనే తాను లెక్క చెప్పాల్సి వచ్చిందని ప్రతి పైసా కోవిడ్​ నియంత్రణకు ఖర్చు చేశామన్నారు. మైసూరు జిల్లాధికారిగా తన దృష్టిమొత్తం మైసూరులో కరోనా నియంత్రణపై తప్ప ఇతర విషయాలు పట్టించుకోనని అన్నారు. ఇప్పటి వరకు రూ.36 కోట్లు ఖర్చుచేశామని , ప్రతి దానికి లెక్కలు ఉన్నాయని తెలిపారు.

మరణాలపై తప్పుడు లెక్కలు : ఎమ్మెల్యే మహేష్​
మైసూరు జిల్లా యంత్రాంగం కరోనా మరణాలపై తప్పుడు లెక్కలు చూపిస్తుందని కేఆర్​ నగర జేడీఎస్​ ఎమ్మెల్యే సా. రా. మహేష్​ ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేలోనే 909 మంది కరోనా మృతి చెందారని, అయితే, జిల్లా అధికారులు మాత్రం కేవలం 238 మాత్రమే మృతి చెందారని తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ రోహిణి సింధూరిపై విమర్షలు గుప్పించారు. 

మరిన్ని వార్తలు