Milk Wasted: 2 వేల లీటర్లు నేల‘పాలు’

27 May, 2021 08:51 IST|Sakshi

దొడ్డబళ్లాపురం: నాణ్యత లేదనే సాకుతో దొడ్డ పట్టణంలోని పాల శీతలీకరణ కేంద్రంలో 2 వేల లీటర్ల పాలను మురుగుకాలువలో పారబోశారు. బమూల్‌ సిబ్బంది చర్యను పాల రైతులు తీవ్రంగా ఖండించారు. దొడ్డ తాలూకాలో రైతుల నుండి తీసుకుంటున్న పాలలో నాణ్యత లోపించిందని సిబ్బంది చెప్పారు.

ఎస్‌ఎన్‌ఎఫ్‌ 8.5 కంటే తక్కువైతే పాలపొడి తయారీకి పనికిరావన్నారు. పొదుగువాపు రోగం ఉన్న ఆవుల నుండి తీసిన పాలు, పాచి కట్టిన క్యాన్‌లలో తీసుకువచ్చే పాలు వేస్తుండడం వల్ల పాలు నాణ్యత లోపిస్తున్నాయన్నారు. నేలపాలు చేయడానికి బదులు కరోనా కష్టకాలంలో ప్రజలకు ఉచితంగా అందజేసినా బాగుండేదని రైతులు అన్నారు.  

మరిన్ని వార్తలు