నామమాత్రంగానే మిర్చి కొనుగోళ్లు

18 Mar, 2023 00:40 IST|Sakshi
మార్కెట్‌ యార్డులో దింపిన మిర్చి బస్తాలు

ఖమ్మంవ్యవసాయం: జిల్లా అంతటా గురువారం సాయంత్రం నుంచి వర్షం కురుస్తుండడంతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి కొనుగోళ్లు మందగించాయి. రోజూ 25వేల నుంచి 30వేల బస్తాల వరకు మిర్చి తీసుకొచ్చే రైతులు శుక్రవారం 15,280 బస్తాల మిర్చి మాత్రమే తీసుకొచ్చారు. వర్షం కారణంగా మిర్చిని యార్డుల్లో కాకుండా షెడ్లలో దింపించిన వ్యాపారులు అక్కడే కొనుగోళ్లు చేపట్టారు. మిర్చి క్వింటాకు గురువారం రూ.23వేల ధర పలకగా.. శుక్రవారం కూడా అదే ధర నమోదైంది తాలు మిర్చి ధర మాత్రం రూ.14వేలు నుంచి రూ.14,500కు చేరింది. ఈ సందర్భంగా మార్కెట్‌ చైర్‌పర్సన్‌ దోరెపల్లి శ్వేత మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్నందున రైతులు పంటలను రక్షించుకోవడంతో పాటు, వర్షం తగ్గాకే ఖమ్మం మార్కెట్‌కు తీసుకురావాలని సూచించారు.

మరిన్ని వార్తలు