యోగాపై అవగాహన పెంపొందించుకోవాలి

27 Mar, 2023 00:06 IST|Sakshi

ఖమ్మం సహకారనగర్‌: ప్రతిఒక్కరు యోగా విశిష్టతను తెలుసుకుని అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్‌ అధికారి(సీఎంఓ) యలగందుల రాజశేఖర్‌ ఆకాంక్షించారు. నగరంలోని సెంచరీ ఆడిటోరియంలో ఇస్తున్న యోగా శిక్షణ ఆదివారం ముగియగా, ఆయన మాట్లాడారు. వ్యాయా మ, ఆరోగ్య విద్యకు నూతన జాతీయ విద్యా విధానంలో ప్రాధాన్యత కల్పించారని తెలి పారు. ఇందులో భాగంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖతో కలిసి ఆరోగ్య విద్యపై డీఆర్సీలకు శిక్షణ ఇచ్చామన్నారు. అనంతరం అరుణ యోగా శిక్షకులను సన్మానించారు. ఈకార్యక్రమంలో సెంచరీ స్కూల్‌ అధినేత ప్రభాకర్‌రావు, శిక్షకులు మనోజ్ఞ, చంద్రశేఖర్‌, పుష్ప, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

నృత్య ప్రదర్శనలో అవార్డు

ఖమ్మంఅర్బన్‌: ఖమ్మంకు చెందిన డాక్టర్‌ జి.వెంకటేశ్వరరావు – అనితరావు కుమార్తె మాన్వి హైదరాబాద్‌లో ఆదివారం డాక్టర్‌ నటరాజరామకృష్ణ 100వ జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన నృత్యప్రదర్శనలో పాల్గొని అవార్డు దక్కించుకుంది. ఈసందర్భంగా ఆమెకు కళా నిలయం సాంస్కృతిక సేవా సంస్థ బాధ్యులు అవార్డు, సర్టిఫికెట్‌ అందజేసి సన్మానించారు.

మదర్సా విద్యార్థులకు ఇఫ్తార్‌ బాక్స్‌లు

ఖమ్మంఅర్బన్‌: ఖమ్మం 14వ డివిజన్‌ గొల్లగూడెంలోని మదర్సా తాలిముల్‌ ఇస్లాంలో విద్యార్థులకు అన్వర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యాన రంజాన్‌ మాసం సందర్భంగా ఇఫ్తార్‌ కోసం ఖర్జూరా బాక్స్‌లు అందజేశారు. జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్‌ ఖమర్‌, కార్పొరేటర్‌ షౌకత్‌ అలీ పాల్గొని మాట్లాడుతూ అన్వర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యాన సేవ కార్యక్రమాలు చేపడుతుండడం అభినందనీయమన్నారు. మదర్సా నిర్వాహకులు మొహమ్మద్‌ అబ్దుల్‌ రవూఫ్‌, అన్వర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ షేక్‌ జిలానీ, ఆల్‌ మేవా జిల్లా అధ్యక్షుడు షేక్‌ యాకూబ్‌ పాషాతో పాటు ఎం.డీ.సలీం, ఎం.డీ.గౌస్‌, గౌస్‌, కలీం, రాహిల్‌ పాల్గొన్నారు.

పురుగుల మందు తాగిన వ్యక్తి మృతి

ఖమ్మంరూరల్‌: ముదిగొండ మండల లక్ష్మీపురానికి చెందిన బి.రాజేష్‌(38) ఈనెల 21న ఖమ్మం రూరల్‌ మండలం తెల్దారుపల్లిలో పురుగుల మందు తాగగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. రాజేష్‌కు తెల్దారుపల్లికి చెందిన బి.శాలినితో వివాహం జరగగా ఒక కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిసైన ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పురుగుల మందు తాగగా తెల్దారుపల్లికి వచ్చి పడిపోయాడు. దీంతో చికిత్స నిమిత్తం ఖమ్మం ఆస్పత్రికి తరలించగా, ఆదివారం మృతి చెందాడని ఎస్‌ఐ వెంకటకృష్ణ తెలిపారు.

గాయపడిన వ్యక్తి..

తిరుమలాయపాలెం: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మండలంలోని తిమ్మక్కపేట గ్రామానికి చెందిన భాషపొంగు వీరస్వామి(39) ఈనెల 5న తిమ్మక్కపేట నుండి మోటార్‌సైకిల్‌ పై తిరుమలాయపాలెం వెళ్తుండగా కొక్కిరేణి సమీపాన అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనను ఆస్పత్రిలో చేర్పించగా ఆది వారం మృతిచెందాడు. వీరస్వామికి భార్య వెంకమ్మ, కుమారుడు సురేష్‌ ఉన్నారు.

రెండు బైక్‌లు ఢీ : ముగ్గురికి గాయాలు

మణుగూరుటౌన్‌: మండలంలోని తిర్లాపురం గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. బయ్యారాని కి చెందిన ఓ వ్యక్తి తన ద్విచక్రవాహనంపై మ ణుగూరు వైపు వస్తున్నాడు. అదే సమయంలో ఆ వాహనం వెనుక పెద్దిపల్లికి చెందిన గొత్తి కోయలు ముగ్గురు తమ ద్విచక్రవాహనంపై వస్తున్నారు. ఈ క్రమంలో ముందున్న బైక్‌ను ఢీకొని కింద పడటంతో ముగ్గురు గొత్తికోయలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు మణుగూరు ఎస్సై రాజ్‌కుమార్‌ తెలిపారు. క్షతగాత్రుల పూర్తి వివరాలు తెలి యాల్సి ఉందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు