పర్యాటకులతో కిన్నెరసానిలో సందడి

27 Mar, 2023 00:08 IST|Sakshi
ద్విచక్రవాహనంపై యాత్ర చేస్తున్న యశ్వంత్‌

పాల్వంచరూరల్‌: మండలంలోని కిన్నెరసానికి ఆదివారం పర్యాటకులు తరలివచ్చారు. పర్యాటకులు డీర్‌ పార్కులోని దుప్పులు, డ్యామ్‌ పైనుంచి జలాశయాన్ని వీక్షిస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందంగా గడపడంతో పాటు రిజర్వాయర్‌లో బోటు షికారు చేశారు. పర్యాటకుల టికెట్ల ద్వారా వైల్డ్‌లైఫ్‌ శాఖకు రూ.15,535, బోటుషీకారు ద్వారా టూరిజం కార్పొరేషన్‌కు రూ.11,150 ఆదాయం సమకూరింది.

బైక్‌పై దక్షిణ భారత యాత్ర..
అశ్వారావుపేటరూరల్‌:
ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు పర్యావరణ రక్షణపై అవగాహన కల్పించేందుకు భువనేశ్వర్‌ నుంచి ఓ యువకుడు ద్విచక్రవాహనంపై దక్షిణ భారత యాత్ర చేపట్టాడు. ఈ యాత్ర ఆదివారం ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పేరాయిగూడెం వద్దకు చేరుకుంది. ఒడిశాకు చెందిన ఆశ్వత్‌ యశ్వంత్‌ ద్విచక్రవాహనంపై భువనేశ్వర్‌ నుంచి ఈనెల 19న యాత్రకు బయలుదేరాడు. ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర మీదుగా తిరిగి ఒడిశాకు చేరుకుంటానని ఆయన తెలిపాడు. యాత్రలో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తూనే... ప్రజల్లో భక్తిభావం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు