నిమజ్జన ఏర్పాట్లపై పరిశీలన

23 Sep, 2023 00:04 IST|Sakshi
మున్నేటి వద్ద పరిశీలిస్తున్న ఉత్సవ సమితి ప్రతినిధులు

ఖమ్మంగాంధీచౌక్‌: ఖమ్మంలోని కాల్వొడ్డు, ప్రకాష్‌ నగర్‌ తదితర ప్రాంతాల్లోని మున్నేటిలో ఈనెల 27న వినాయక నిమజ్జనం జరగనుంది. నగరంలో ఈ ఏడాది దాదాపు 1,200 వరకు ఉత్సవాలను ప్రతిష్ఠించినట్లు అంచనా. ఆయా విగ్రహాలను భక్తులు ఊరేగింపుగా తీసుకొచ్చి కాల్వొడ్డు్‌, ప్రకాష్‌నగర్‌, నాయుడుపేట వైపు ఉన్న మున్నేటిలో నిమజ్జనం చేస్తారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ప్రభు త్వ శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈమేరకు శుక్రవారం స్తంభాద్రి ఉత్సవ సమితి బాధ్యులు నిమజ్జన ప్రదేశాలను పరిశీలించడంతో పాటు అధికారులు చర్చించారు. సమితి అధ్యక్ష, కార్యదర్శులు వినోద్‌ లాహోటి, కీసర జయపాల్‌రెడ్డితో పాటు గెంటాల విద్యాసాగర్‌, కన్నం ప్రసన్నకృష్ణ, అల్లిక అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు