మహిళా రిజర్వేషన్‌ బిల్లు తక్షణమే అమలుచేయాలి

24 Sep, 2023 00:08 IST|Sakshi
మాట్లాడుతున్న ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి

ఖమ్మంమయూరిసెంటర్‌/ఖమ్మం రూరల్‌/తిరుమలాయపాలెం: పార్లమెంట్‌లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్‌ బిల్లును కేంద్రప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్‌.అరుణజ్యోతి డిమాండ్‌ చేశారు. రిజర్వేషన్‌ బిల్లును తక్షణమే అమలుచేయాలనే డిమాండ్‌తో ఐద్వా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యాన చేపట్టిన జీపుజాతా శనివారం ఖమ్మం రూరల్‌ మండలం ఎం.వెంకటాయపాలెం, తిరుమపాలెంతో పాటు ఖమ్మం నగరంలో కొనసాగింది. ఈ సందర్భంగా అరుణజ్యోతి మాట్లాడుతూ.. మణిపూర్‌ ఘటన నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కేంద్రం మహిళా రిజర్వేషన్‌ బిల్లును తీసుకొచ్చిందని ఆరోపించారు. అందుకే ఆమోదంతోనే సరిపెట్టి అమలుపై జాప్యం చేయాలని చూస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బండి పద్మ, మాచర్ల భారతి, నాయకులు బుగ్గవీటి సరళ, మెరుగు రమణ, మెహరున్నీసాబేగం, ఎస్‌కే బీబీ, సుమతి, అమరావతి, బేబీ, భాగం అజిత, కళమ్మ, సుమతి, శోభారాణి, అఫ్రోజ్‌, సమీనా, పద్మ, ప్రభావతి, ముత్తమ్మ, ఆర్‌.కృష్ణవేణి, కుమారి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు