బాయిలర్‌ పేలిన డెయిరీలో తనిఖీలు

26 Sep, 2023 00:24 IST|Sakshi

ఖమ్మంఅర్బన్‌: ఖమ్మం 8వ డివిజన్‌ గోపాలపురంలోని ఒక ప్రైవేట్‌ డెయిరీలో ఇటీవల బాయిలర్‌ పేలగా అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఘటన జరిగిన రోజు ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ తనిఖీ చేసి యజమాని అందుబాటులో లేరు. దీంతో సోమవారం తాళం తీయించిన పుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ కిరణ్‌కుమార్‌ డెయిరీ పరిసరాలను పరిశీలించారు. గతంలో ఫుడ్‌ సేఫ్టీ లెసెన్స్‌ తీసుకున్నా గడువు దాటాక రెన్యువల్‌ చేసుకోలేదని గుర్తించారు. అనంతరం డెయిరీలో పాలు, పాల ఉత్పత్తుల శాంపిల్స్‌ సేకరించిన ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ మాట్లాడుతూ ల్యాబ్‌ నుంచి వచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని వార్తలు