హైదరాబాద్‌ జిల్లా జడ్జిగా భద్రాద్రి వాసి

20 Nov, 2023 00:04 IST|Sakshi
తల్లిని సన్మానిస్తున్న న్యాయమూర్తి వెంకటేశ్వరరావు

భద్రాచలంఅర్బన్‌: వరంగల్‌లో సీనియర్‌ సివిల్‌ జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్న మండా వెంకటేశ్వరరావు హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టులో జిల్లా జడ్జిగా ఇటీవల పదోన్నతిపై బాధ్యతలు స్వీకరించారు. భద్రాచలానికి చెందిన ఆయనను భద్రాచలం బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ వెంకటేశ్వరరావు భద్రాచలంలో పుట్టి పెరిగి న్యాయవృత్తిని స్వీకరించాక అంచెలంచెలుగా ఎదిగారని కొనియాడారు. అనంతరం వెంకటేశ్వరరావు తన తల్లిని సన్మానించి మాట్లాడుతూ తల్లి స్ఫూర్తితోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు. భద్రాచలం జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ జడ్జి వెంకటేశ్వరరావు, ప్రిన్సిపల్‌ సివిల్‌ జడ్జి భువనగిరి దేవరపల్లి నాగేశ్వరరావు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కోట దేవదానంతోపాటు న్యాయవాదులు కృష్ణమాచారి, కృష్ణకుమార్‌, పీవీ.రమణరావు, కొలిచిన నవీన్‌, ముత్యాల కిషోర్‌, గుడపర్తి నాగరాజు, కొడాలి శ్రీనివాస్‌, అక్తర్‌, సల్మాన్‌రాజ్‌, రాము, కృష్ణకుమారి, అరుణాశ్రీ, సంధ్య, అంజలి, సాధనపల్లి సతీష్‌, జగదీష్‌, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు