ఏ మాత్రం ఏమరపాటుగా ఉండొద్దు

20 Nov, 2023 00:06 IST|Sakshi
పెద్దమ్మతల్లిని దర్శించుకుంటున్న ప్రసాదరావు తదితరులు

నేలకొండపల్లి: సరిహద్దు దాటి మద్యం, నగదు, ఇతరత్రా ఏవీ రాకుండా పకడ్బందీగా తనిఖీలు చేపట్టాలని ఎన్నికల పరిశీలకుడు, ఐపీఎస్‌ అధికారి బ్రిజేష్‌కుమార్‌రాయ్‌ సూచించారు. నేలకొండపల్లి మండలంలోని అంతర్రాష్ట్ర, జిల్లా సరిహద్దు చెక్‌పోస్టులను ఆదివా రం ఆయన తనిఖీ చేశారు. పైనంపల్లి, కొంగర క్రాస్‌రోడ్డు చెక్‌పోస్టులను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించాక నేలకొండపల్లి పోలీస్‌స్టేషన్‌ను కూడా తనిఖీ చేసి అధికారులతో సమావేశమయ్యారు. కూసుమంచి సర్కిల్‌లో శాంతిభద్రతల పరిస్థితిని తెలుసుకున్నారు. సమస్యాత్మక గ్రామాల్లో నిఘా పెంచాలని, చెక్‌పోస్టుల వద్ద ఉద్యోగులు అప్రమత్తంగా ఉంటూ ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలని ఆదేశించారు. కూసుమంచి సీఐ కె.జితేందర్‌, నేలకొండపల్లి ఎస్సై బి.సతీష్‌, ఏఎస్సై కె.కోడేత్రాచు తదితరులు పాల్గొన్నారు.

నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం

భద్రాచలంటౌన్‌: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి నిత్యకల్యాణ వేడుక ఆదివారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, గోదావరి తీరంలో సందడి వాతావరణం నెలకొంది.

పెద్దమ్మతల్లికి

ప్రత్యేక పూజలు

పాల్వంచ : మండలంలోని శ్రీ కనకదుర్గ (పెద్దమ్మతల్లి) అమ్మవారికి ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. సెలవు రోజు కావండతో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. పసుపు, కుంకుమ, చీర, సారెతో పాటు ఒడిబియ్యం, బోనాలు, తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లా టాస్స్‌ఫోర్స్‌ రేంజ్‌ ఆఫీసర్‌ ప్రసాదరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రజినీకుమారి,ఽ ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీనివాస రెడ్డి, గంధం వెంగళరావు, వెంకట రామారావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు