తెల్లంను గెలిపించండి.. భద్రాద్రి ప్రజలు కోరిందల్లా చేస్తా

20 Nov, 2023 00:06 IST|Sakshi

జిల్లాలో సోమవారం చలి ప్రభావం పెరిగే అవకాశముంది. మధ్యాహ్నం ఎండగా ఉన్నా సాయంత్రానికి చలి మొదలవుతుంది.
‘గులాబీవనం’లో భద్రాచలం చేరాలి
● తెల్లంను గెలిపించండి.. భద్రాద్రి ప్రజలు కోరిందల్లా చేస్తా

భద్రాచలం: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీఆర్‌ఎస్‌ గులాబీవనంలో భద్రాచలం కూడా చేరాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. భద్రాచలంలో జరిగిన రోడ్‌షో, కార్న ర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. 2014, 2018 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఒకే సీటు రావడం బాధాకరమన్నారు. అయితే, ఈసారి కూడా కేసీఆర్‌ సీఎం కావడం, రాష్ట్రంలో గులా బీ విప్లవం ఖాయమని.. ఆ సైన్యంలో భద్రాచలం ఎమ్మెల్యేనూ చేర్చాలని పిలుపునిచ్చారు. భద్రాచలం అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కట్టుబడి ఉన్నందునే గిరిజనులకు 16 వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చి, గోదావరి వరదల నుంచి కాపాడేలా కరకట్ట పొడిగింపునకు రూ.38 కోట్ల తో టెండర్‌ ఖరారు చేశారన్నారు. కాగా, సీతమ్మసాగర్‌ ప్రాజెక్టుపై స్థానిక ఎమ్మెల్యే కోర్టులో కేసు వేయడమేకాక డంపింగ్‌ యార్డు నిర్మాణాన్నీ అడ్డుకున్నారని ఆరోపించారు. ఇలాంటి కారణాలు, కొద్దిపాటి గ్యాప్‌తో భద్రాచలాన్ని అభివృద్ధి చేయలేకపోయామని, తమపై విశ్వా సంతో వెంకట్రావ్‌ను గెలిపించాలని కోరారు.

రాముడిపై భక్తిలేకపోవడమేంటి?

‘నా పేరే తారక రాముడు, మా ఇంట్లో రాముడిపై భక్తిలేకపోతే ఈ పేరెందుకు పెడతారు’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు. మళ్లీ ప్రభుత్వం ఏర్పడ గా నే రాముడిని దర్శించుకోవడమే కాక యాదాద్రి తరహాలో భద్రాద్రిని అభివృద్ధిని చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల కోరిక మేరకే గ్రామపంచాయతీలను ఏర్పాటుచేస్తామన్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి తెల్లం వెంకట్రావ్‌, ఎంపీ మాలోత్‌ కవిత, ఎమ్మెల్సీ తాతా మధు, విప్‌ రేగా కాంతారావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు