చుట్టేస్తారా..

13 Nov, 2023 23:52 IST|Sakshi
● ప్రచారానికి మిగిలింది 14 రోజులే ● ఉమ్మడి జిల్లాలో పూర్తికాని ముఖ్యనేతల పర్యటన ● బీఆర్‌ఎస్‌ అన్ని నియోజకవర్గాలు టచ్‌ చేసేలా ప్లాన్‌ ● కాంగ్రెస్‌, బీజేపీలది కొంత మందకొడిగా.. ● 26న నిర్మల్‌కు మోదీ.. త్వరలో మందమర్రికి రాహుల్‌గాంధీ ● ఆదిలాబాద్‌లో ఇప్పటికే పర్యటించిన అమిత్‌షా.. త్వరలో ‘యోగి’ రాక..

సాక్షి, ఆదిలాబాద్‌: ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణతో పాటు పరిశీలన ప్రక్రియ కూడా ముగిసింది. ప్రస్తుతం ప్రచార పర్వం మంచి ఊపులో ఉంది. ఈ నెల 30న ఎన్నికలు నిర్వహించనుండగా, అంతకుముందు 48 గంటలు ముందుగా అంటే.. 27వ తేది రాత్రితో ప్రచారం పరిసమాప్తం అవుతుంది. ఈక్రమంలో వాడవాడన ప్రస్తుతం ప్రచార రథాలు సందడి చేస్తున్నాయి. కార్యకర్తలు పార్టీల మేనిఫెస్టోను జనాల్లోకి తీసుకెళ్తున్నారు. ఇకపోతే జాతీయ, రాష్ట్ర నేతలు ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించారు. ఇంకా పలు చోట్ల పర్యటించాల్సి ఉంది. మిగిలింది మాత్రం 14 రోజులే.

మోదీ, రాహుల్‌ రాక..

బీజేపీకి సంబంధించి ఇప్పటికే ఆదిలాబాద్‌ జిల్లాలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బహిరంగ సభ జరగగా, ఈ నెల 26న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్మల్‌లో పర్యటిస్తున్నారు. ఇక ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ త్వరలో ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక కాంగ్రెస్‌ ప్రచారానికి సంబంధించి ఉమ్మడి జిల్లాకు రాహుల్‌ గాంధీ రానున్నట్లు హస్తం నేతలు చెబుతున్నారు. చెన్నూర్‌ నియోజకవర్గంలోని మందమర్రిలో త్వరలో సభ నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంటున్నారు.

ఆ రెండు నియోజకవర్గాలను టచ్‌ చేయలేదు..

ముఖ్య నేతల పర్యటనలకు సంబంధించి ఇప్పటివరకు పలు నియోజకవర్గాల్లో ఏదైనా పార్టీ నుంచి బహిరంగ సభలు నిర్వహించినప్పటికీ మంచిర్యా ల, బోథ్‌ నియోజకవర్గాల్లో ఇటు జాతీయ, అటు రాష్ట్ర నేతలెవరు ఎన్నికల షెడ్యూల్‌ జారీ అయిన తర్వాత రాకపోవడం గమనార్హం. ఈ రెండు నియోజకవర్గాల్లో త్వరలో సీఎం కేసీఆర్‌ పర్యటించనున్నారు. ఈ నెల 17 నుంచి కాంగ్రెస్‌ ప్రచారంలో భాగంగా రాష్ట్రానికి రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే వారం రోజులు పర్యటిస్తున్నారు. ఆ రోజుల్లోనే ఉమ్మడి జిల్లాలో పర్యటించే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మోదీ నిర్మల్‌ సభకు పెద్ద ఎత్తున జనసమీకరణ చేసేలా నేతలు ప్రణాళిక చేస్తున్నారు.

బీజేపీ, కాంగ్రెస్‌ అసంపూర్తేనా..

బీఆర్‌ఎస్‌ టచ్‌ చేయని నియోజకవర్గాలు మంచిర్యాల, బోథ్‌ ఉండగా, కాంగ్రెస్‌ టచ్‌ చేయనివి చెన్నూర్‌, మంచిర్యాల, నిర్మల్‌, భైంసా, ఆసిఫాబాద్‌, సిర్పూర్‌, బోథ్‌లు ఉన్నాయి. బీజేపీ టచ్‌ చేయని నియోజకవర్గాలు చెన్నూర్‌, బెల్లంపల్లి, మంచిర్యాల, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, భైంసా, బోథ్‌ ఉన్నాయి. బీఆర్‌ఎస్‌ ప్రణాళిక ప్రకారం మిగతా నియోజకవర్గాలను చుట్టేయనుంది. అయితే ఈ మిగిలిన రోజుల్లో బీజేపీ, కాంగ్రెస్‌ అన్ని నియోజకవర్గాల్లో పర్యటనకు సంబంధించి ఇప్పటివరకు ప్లాన్‌ కనిపించడం లేదు. దీంతో ఈ రెండు పార్టీల ముఖ్య నేతల పర్యటన అసంపూర్తిగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కేసీఆర్‌ పర్యటించిన నియోజకవర్గాలు..: చెన్నూర్‌, బెల్లంపల్లి, నిర్మల్‌, భైంసా, ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌

షెడ్యూల్‌ ఖరారైనవి: 16న ఆదిలాబాద్‌, బో థ్‌, 24న మంచిర్యాల, 26న ఖానాపూర్‌ రాక

కేటీఆర్‌ పర్యటించినవి: చెన్నూర్‌

షెడ్యూల్‌ ఖరారైనవి: 17న ఖానాపూర్‌ నియోజకవర్గం జన్నారం, 27న ఖానాపూర్‌లో రోడ్‌షో.

హరీశ్‌రావు పర్యటించినవి: చెన్నూర్‌, ఖానాపూర్‌, ఆదిలాబాద్‌

కిషన్‌ రెడ్డి, ఈటల పర్యటించినవి: ఆదిలాబాద్‌

బండి సంజయ్‌ పర్యటించినవి: ఆదిలాబాద్‌, ఖానాపూర్‌, సిర్పూర్‌

రేవంత్‌రెడ్డి పర్యటించినవి: బెల్లంపల్లి, ఖానాపూర్‌, ఆదిలాబాద్‌

షెడ్యూల్‌ ఖరారైనవి: 15న నిర్మల్‌, బోథ్‌కు రాక, త్వరలో చెన్నూర్‌కు వచ్చే అవకాశం.

కేసీఆర్‌ పూర్తిస్థాయిలో..

బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి సీఎం కేసీఆర్‌, పార్టీ వ ర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఆర్థిక మంత్రి హరీష్‌రావులు ప్రజా ఆశీర్వాద సభల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలో పర్యటించారు. కేసీఆర్‌ ఉ మ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇప్పటికే ఆరు ని యోజకవర్గాల్లో సభలను పూర్తి చేశారు. మరో నాలుగు సభల్లో పర్యటించేలా ప్రణాళిక ఖ రారైంది. కాంగ్రెస్‌ విజయభేరి సభల్లో భాగంగా రేవంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తున్నా రు. మూడు నియోజకవర్గాల్లో సభలు పూర్తి చేశారు. త్వరలో మరో రెండు చోట్ల షెడ్యూల్‌ ఖరారైంది. బీజేపీ జనగర్జన సభల్లో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆదిలాబాద్‌ జి ల్లా కేంద్రంలో జరిగిన సభలో పాల్గొన్నారు. ఆయన వెంట రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఈ టల రాజేందర్‌, బండి సంజయ్‌ విచ్చేశారు. బీజేపీకి సంబంధించి మూడు నియోజకవర్గాల్లోనే ముఖ్యనేతల పర్యటన సాగింది.

మరిన్ని వార్తలు