కొత్త ఓటర్లు 5,904 మంది

13 Nov, 2023 23:52 IST|Sakshi
● చివరి అవకాశాన్ని వినియోగించుకున్న అర్హులు ● జిల్లాలో 4,53,538కు చేరిన ఓటర్ల సంఖ్య

ఆసిఫాబాద్‌: జిల్లాలో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. కొన్ని నెలలుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు జిల్లాలోని గుర్తింపు పొందిన రాజ కీయ పార్టీలతో జిల్లా ఎన్నికల అధికారులు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. కలెక్టర్‌ హేమంత్‌ బో ర్కడే ఆధ్వర్యంలో పలుమార్లు ఓటరు నమోదుపై అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహించారు. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు కొత్తగా ఓట రు నమోదు చేసుకోవాలని బీఎల్‌వోలతోపాటు స్థా నిక అధికారులు అవగాహన కల్పించారు. అలాగే క ళాశాలల్లో విద్యార్థులకు ఓటరు నమోదు ప్రాముఖ్య తను వివరించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. నేరుగా దరఖాస్తు ఓటరు నమోదు చేయడంతోపాటు సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో ఓటరు నమోదుకు అ వకాశం కల్పించారు. ఈ నెల 30న అసెంబ్లీ ఎన్నిక ల నేపథ్యంలో అక్టోబర్‌ 31 వరకు ఓటరు నమోదు కు చివరి అవకాశం కల్పించారు. జిల్లాలో కొత్తగా 5,904 మంది కొత్తగా ఓటరుగా నమోదు చేసుకున్నారు.

మొత్తం 4,53,538 మంది..

అక్టోబర్‌ 4న రాష్ట్ర ఎన్నికల సంఘం తుది ఓటరు జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ జాబితా ప్రకారం జిల్లాలో 4,47,634 మంది ఓటర్లు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం అర్హులైన వారికి అక్టోబర్‌ 31 వరకు ఓటరు నమోదుకు చివరి అవకాశం కల్పించింది. నెల రోజుల్లో 5,904 మంది కొత్త ఓటర్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. తాజాగా జిల్లాలోని ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య 4,53,538కి చేరింది. ఇందులో పురుషులు 2,26,844 మంది, మహిళలు 2,26,666 మంది, ఇతరులు 28 మంది ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో జిల్లాలో 3,48,710 మంది ఓటర్లు ఉన్నారు. ఐదేళ్లలో గణనీయంగా కొత్త ఓటర్లు పెరిగారు. మొత్తం 1,04,828 మంది ఓటర్లుగా నమోదయ్యారు.

వయస్సుల వారీగా ఓటర్లు

వయస్సు సిర్పూర్‌ ఆసిఫాబాద్‌ మొత్తం

18– 19 8,318 9,626 17,944

20– 29 47,205 57,957 10,5162

30– 39 57,550 64,140 12,1690

40– 49 45,321 40,479 85,800

50–59 34,061 28,198 62,259

60– 69 20897 16,401 3,7298

70– 79 10,083 7,472 17,554

80పైన 3,489 2,392 5,831

తాజా ఓటరు జాబితా వివరాలు

నియోజకవర్గం పోలింగ్‌ కేంద్రాలు పురుషులు సీ్త్రలు ఇతరులు మొత్తం

ఆసిఫాబాద్‌ 304 1,12,899 1,13,748 17 2,26,664

సిర్పూర్‌ 293 1,13,945 1,12,918 11 2,26,874

మరిన్ని వార్తలు