-

కరాటే పోటీల్లో క్రీడాకారుల సత్తా

28 Nov, 2023 01:44 IST|Sakshi
పతకాలు సాధించిన క్రీడాకారులతో సీఐ నవీన్‌ నరసింహమూర్తి, కోచ్‌ కట్టా సుధాకర్‌

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌: ఇటీవల విశాఖపట్టణంలో జరిగిన 19వ డబ్ల్యుకేఐ ఇంటర్నేషనల్‌ కరాటే చాంపియన్‌షిప్‌–2023 పోటీల్లో హనుమాన్‌జంక్షన్‌కు చెందిన టైగర్‌ పవర్‌ కిక్‌ బాక్సింగ్‌ అండ్‌ కరాటే స్కూల్‌ క్రీడాకారులు సత్తా చాటినట్లు కోచ్‌ కట్టా సుధాకర్‌ సోమవారం తెలిపారు. ఈ నెల 24, 25, 26 తేదీల్లో విశాఖ పోర్టు స్టేడియంలో నిర్వహించిన పోటీల్లో 15 దేశాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారని చెప్పారు. పతకాలు సాధించిన క్రీడాకారులను సీఐ అల్లు నవీన్‌ నరసింహమూర్తి అభినందించారు. బాలుర విభాగంలో కట్టా మనోజ్‌ (27 కేజీలు) కుమిటి కేటగిరీలో రజిత పతకం సాధించగా, కటాస్‌ కేటగిరీలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారని కోచ్‌ సుధాకర్‌ చెప్పారు. నిమ్మల వృశాంక్‌ (30 కేజీలు) కుమిటి కేటగిరిలో కాంస్య పతకం సాధించగా, కటాస్‌ కేటగిరిలో రజిత పతకాన్ని సొంతం చేసుకున్నారని వివరించారు. శివ సాయి ఆశ్రిత్‌ (27 కేజీలు), కత్తుల సుందర చైతన్య (31 కేజీలు), కాంచన శర్వానంద్‌ (43 కేజీలు), తమ్మిన సూర్య సత్య నాగ ఈశ్వర్‌, కొనకళ్ల లోకేష్‌ కుమార్‌ (48 కేజీలు), ఆది విష్ణు నీల మణికంఠ (59 కేజీలు)లు కటాస్‌, కుమిటి కేటగిరిల్లో కాంస్య పతకాలను కై వసం చేసుకున్నారని వివరించారు. బాలికల విభాగంలోని కటాస్‌, కుమిటి కేటగిరిలలో మత్తి హర్షిత (31 కేజీలు), మాటూరి సాహిత్య లక్ష్మీ (43 కేజీలు), గోల్తి గోపిక (41 కేజీలు), కొనకళ్ల హారిక ధనలక్ష్మీ (66 కేజీలు), పిల్లి లావణ్య (27 కేజీలు) కాంస్య పతకాలను సొంతం చేసుకున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ కరాటే పోటీల్లో పాల్గొనేందుకు గానూ ఈ క్రీడాకారులకు ఆర్థిక సాయం అందించిన దాతలు అడపా వంశీకృష్ణ, బాల రవికిరణ్‌, గరికపాటి శివశంకర్‌, కొలుసు ఇంద్ర ప్రసాద్‌, కమ్మిలి సూర్యనారాయణ మూర్తి, నరేష్‌లకు కోచ్‌ సుధాకర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు