-

చట్టపరిధిలో సమస్యలు పరిష్కారం

28 Nov, 2023 01:44 IST|Sakshi
స్పందనలో ఓ వృద్ధుడి సమస్యను ఆలకిస్తున్న ఎస్పీ పి. జాషువా

కోనేరుసెంటర్‌: స్పందనలో వచ్చిన ప్రతి అర్జీని చట్టపరిఽధిలో విచారణ చేపట్టి పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ పి.జాషువ తెలిపారు. సోమవారం నిర్వహించిన స్పందనలో పాల్గొన్న ఆయన జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రతి ఒక్కరి సమస్యను సామరస్యంగా ఆలకించి కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. మరి కొన్ని సంబఽంధిత అధికారులకు సిఫార్సు చేసి వెంటనే పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ న్యాయం కోసం వచ్చిన ఏ ఒక్కరికీ అన్యాయం జరగనివ్వమన్నారు. వ్యాపారం చేసుకునేందుకు రుణం ఇప్పిస్తానని నమ్మించి తమ సమీప బంధువు రూ.2 లక్షలు తీసుకొని మోసం చేశాడని, న్యాయం చేయాలని మచిలీపట్నంకు చెందిన సుధీర్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధిస్తున్నారని అవనిగడ్డకు చెందిన అనురాధ అనే వివాహిత ఫిర్యాదు చేసింది. న్యాయం చేయాలని విన్నవించింది. డబ్బు కోసం తన భర్త తనను ఇంటి నుంచి గెంటేశాడని చల్లపల్లికి చెందిన రేవతి అనే వివాహిత ఫిర్యాదు చేసింది. పుట్టింటి నుంచి అడిగినంత తీసుకురమ్మని బెదిరించటంతో పాటు తన మగ బిడ్డను అతనితోనే ఉంచుకుని తనను ఇంటి నుంచి గెంటేశాడంటూ కన్నీరు పెట్టుకుంది. ఏడాది నుంచి తన కొడుకు చూడనివ్వకుండా మానసికంగా హింసిస్తున్నారంటూ ఆవేదన చెందింది. న్యాయం చేయాలని కోరింది.

మరిన్ని వార్తలు