రెండేళ్ల చిన్నారికి వైద్యంతో పునర్జన్మ

29 Nov, 2023 01:42 IST|Sakshi

లబ్బీపేట(విజయవాడతూర్పు): అత్యంత ప్రమాదకరమైన అక్యుట్‌ లుకేమియా(ఏఎల్‌ఎల్‌) సోకిన రెండేళ్ల చిన్నారికి అత్యాధునిక వైద్య సేవలు అందించిన వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు. మెడికల్‌ అంకాలజిస్ట్‌ డాక్టర్‌ కొల్లూరు సాయికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం గుంటూరుకు చెందిన రెండేళ్ల చిన్నారికి తరచుగా జ్వరం రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలతో చికిత్స నిమిత్తం కృష్ణాజిల్లా పెనమలూరు మండలం కానూరులోని అమెరికన్‌ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్‌కు వచ్చారన్నారు. చిన్నారికి ప్రాథమిక పరీక్షల్లో తెల్ల రక్తకణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటం, తక్కువ ప్లేట్‌లెట్‌ కౌంట్‌, రక్తహీనత వంటి సమస్యలు గుర్తించామన్నారు. బోన్‌మ్యారో అధ్యయనాలతో పాటు రోగ నిర్ధారణ పరీక్షలు చేయగా అక్యూట్‌ లింపోట్లాస్టిక్‌ లుకేమియాగా నిర్ధారించినట్లు తెలిపారు. అధిక ప్రమాద స్థాయి కలిగిన పిల్లలను ప్రభావితం చేసే రక్త క్యాన్సర్‌గా పేర్కొన్నారు. మూడు నెలల పాటు చిన్నారిని ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో ఉంచి, ప్రభావవంతమైన చికిత్సను అందించామన్నారు. చికిత్స మధ్యలో వచ్చిన దుష్ప్రభావాలను నిరోధిస్తూ చిన్నారికి విజయవంతంగా చికిత్సను పూర్తిచేసి పునర్జన్మను ప్రసాదించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు