4 నుంచి 7 వరకు రైల్వే క్లెయిమ్స్‌ లోక్‌ అదాలత్‌

29 Nov, 2023 01:42 IST|Sakshi

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): రైలు ప్రమాద బాధితులు, రైళ్ల రవాణాలో సరుకు పోయినా లేదా దెబ్బతిన్న సంఘటన కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు రైల్వే క్లెయిమ్స్‌ ట్రిబ్యునల్‌, అమరావతి బెంచ్‌, గుంటూరు ఆధ్వర్యంలో డిసెంబర్‌ 4 నుంచి 7 వరకు లోక్‌ అదాలత్‌ మూడవ ఫేజ్‌ నిర్వహించనున్నట్లు రైల్వే క్లెయిమ్స్‌ట్రిబ్యునల్‌ సభ్యులు జాన్‌ప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. బాధితులు, రైల్వే పరిపాలన శాఖ పరస్పర అంగీకారంతో 133 కేసులను ఈ లోక్‌ అదాలత్‌లో పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఇదే ఏడాది రెండు సార్లు నిర్వహించిన లోక్‌ అదాలత్‌ల ద్వారా ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న కేసులను విజయవంతంగా పరిష్కరించామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం అర్హులైన బాధితులకు న్యాయపరమైన పరిహారం అందజేయడంలో ఈ లోక్‌ అదాలత్‌ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

మరిన్ని వార్తలు