అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

29 Nov, 2023 01:42 IST|Sakshi
శ్రీనివాసరావు మృతదేహం

గుడివాడరూరల్‌: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. పట్టణంలోని ఏలూరురోడ్డులో సోనోవిజన్‌ వద్ద నందివాడ మండలం ఒద్దు ల మెరక గ్రామానికి చెందిన కందుల శ్రీనివాసరావు(46) పనిమీద గుడివాడ వచ్చాడు. ఈ క్రమంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించి వెంటనే వన్‌టౌన్‌ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి కుమారుడు గోపికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కె.మాణిక్యాలరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మూడు కేజీల గంజాయి స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్‌

చిట్టినగర్‌(విజయవాడపశ్చిమ): గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను అరెస్టు చేయడంతో పాటు వారి నుంచి మూడు కేజీల గంజాయిని కొత్తపేట పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రైల్వే ఆప్‌ యార్డు వద్ద గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో సీఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో రైల్వే ఆప్‌ యార్డు వద్ద తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో అటుగా ఇద్దరు యువకులు వస్తూ పోలీసులను చూసి కంగారుపడ్డారు. వారిని పోలీసులు ఆరా తీయగా వారు చిట్టినగర్‌కు చెందిన పిళ్లా మోహన్‌రావు, పాత రాజరాజేశ్వరిపేటకు చెందిన షేక్‌.రిజ్వాన్‌లుగా గుర్తించారు. నిందితుల నుంచి 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశామన్నారు.

మరిన్ని వార్తలు