ప్రభుత్వ మేలు మరువలేను

29 Nov, 2023 01:44 IST|Sakshi

మద్దతు ధర విషయంలో రైతులకు మేలు జరిగేలా ప్రభుత్వం చూస్తోంది. 3.63 ఎకరాల్లో వరి సాగు చేసి, పంట కోతకు ముందే అధికారులకు సమాచారం ఇచ్చాను. కోత కోయగానే, వాతావరణం మబ్బుగా ఉండటంతో లారీల్లో ధాన్యం ఎత్తించి మిల్లుకు పంపారు. తేమశాతం పరిశీలించి వివరాలను నమోదు చేశారు. 40 కిలోల 250 బస్తాలకు రూ.2.18 లక్షలు నా బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఈ నెల 20వ తేదీన పంట విక్రయించగా 23న డబ్బులు అందాయి. తేమశాతం ప్రకారం చూస్తే మద్దతు ధర చేతికి అందింది. ప్రభుత్వ మేలు మరువలేను.

– పోతినేని కోటేశ్వరరావు, రైతు, పునాదిపాడు

మరిన్ని వార్తలు