నాలుగో రోజే డబ్బులొచ్చాయి

29 Nov, 2023 01:44 IST|Sakshi

ఈ ఖరీఫ్‌లో 3.06 ఎకరాల్లో వరి సాగు చేశాను. యంత్రంతో పంట కోయించాను. రైతుభరోసా కేంద్రానికి సమాచారం ఇవ్వటంతో టెక్నికల్‌ సిబ్బంది వచ్చి ధాన్యం శ్యాంపిల్‌ తీసుకున్నారు. తేమ పరిశీలించి ఈ నెల 20న మిల్లుకు ధాన్యం తరలించారు. 40 కిలోల 230 బస్తాలను లారీలో పంపించారు. 23వ తేదీన నా బ్యాంకు ఖాతాలోరూ.2.08 లక్షలు జమయ్యాయి. పంట విక్రయించిన నాలుగు రోజుల్లో డబ్బులు వస్తాయనుకోలేదు. రైతుల ఇబ్బందులను గుర్తించి ముందు చూపుతో చెల్లింపులు చేయడం మంచి నిర్ణయం.

– కనకా చిట్టియ్య, రైతు, పునాదిపాడు

మరిన్ని వార్తలు