పారదర్శకంగా కొనుగోళ్లు

29 Nov, 2023 01:44 IST|Sakshi

జిల్లాలో పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు జరిగేలా ఏర్పాట్లు చేశాం. ప్రస్తుతం పెనమలూరు, పామర్రు, పెడన నియోజకవర్గాల్లో ధాన్యం సేకరణ వేగంగా సాగుతోంది. ఆర్‌బీకే, మిల్లుల వద్ద తేమ శాతంలో తేడాలు రాకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నాం. రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటాం. రైతుల సమస్యల పరిష్కారం కోసం కంట్రోల్‌ రూం ఏర్పాటు చేస్తున్నాం. డయల్‌ యువర్‌ జేసీకి కాల్‌ చేసి కూడా ఫిర్యాదు చేయొచ్చు. దళారులు, మధ్యవర్తుల మాటలు నమ్మి రైతులు మోసపోవద్దు.

– అపరాజిత సింగ్‌, జాయింట్‌ కలెక్టర్‌, కృష్ణా జిల్లా

మరిన్ని వార్తలు