నేడు శ్రీశైలంలో ‘కామదహనం’

5 Mar, 2023 00:20 IST|Sakshi

శ్రీశైలంటెంపుల్‌: ఫాల్గుణ శుద్ధ చతుర్దశి ఘడియలు పురస్కరించుకుని శ్రీశైల మహాక్షేత్రంలో ఆదివారం సాయంత్రం కామదహన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు పల్లకీ సేవ నిర్వహించి గంగాధర మండపం వద్దకు తోడ్కొని వచ్చి శాస్త్రోక్తంగా పూజలు చేస్తారు. అనంతరం సంప్రదాయాన్ని అనుసరించి గడ్డితో చేసిన మన్మధ రూపాన్ని దహనం చేస్తారు. శివ తపస్సు భంగం చేయగా, కోపించిన పరమశివుడు మన్మధుడిని ఫాల్గుణశుద్ద చతుర్దశి రోజున దహించినట్లు పురాణాలు చెబుతున్నాయి. కామదహన కార్యక్రమాన్ని వీక్షించడంతో శివకటాక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు