గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

5 Dec, 2023 05:28 IST|Sakshi

శ్రీశైలంప్రాజెక్ట్‌: గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ డీజీవీ శంకరరావు అన్నారు. సోమవారం ఉదయం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను ఎస్టీ కమీషన్‌ చైర్మన్‌తో పాటు సభ్యులు వి.సోమశంకరనాయక్‌, కొర్రా రామలక్ష్మి, జరపరంగి సురేష్‌, మురళీదొర, ఎం. విశ్వేశ్వరరాజులు దర్శించుకున్నారు. అనంతరం ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. ఆ తర్వాత మేకలబండ చెంచుగిరిజన గూడెంలోని గిరిజనులతో వారు ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. అంకమ్మ చెంచుగూడానికి చెందిన బీటెక్‌ విద్యార్థిని కురుముల అంజమ్మకు ల్యాప్‌టాప్‌ను అందించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు