సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం

5 Dec, 2023 05:28 IST|Sakshi

కప్పుడు తిండికి, గుడ్డకు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డాం. చేతిలో చిల్లి గవ్వ ఉండేది కాదు. అప్పులు పుట్టేవికావు. కూలి పనికి వెళ్లినా వారానికి డబ్బులు ఇచ్చేవారు. మాటల్లో చెప్పలేని బాధలను అనుభవించాం. మా ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇరుపొరుగువారు కూడా మావైపు చూసేవాళ్లు కాదు. ఉన్న కొద్దిపాటి భూమిలో పంటలు పండక నానా తంటాలు పడేవాళ్లం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా బతుకుల్లో మార్పు వచ్చింది. నేను పొదుపు గ్రూపులో ఉండటంతో రోటీ మేకింగ్‌ కేంద్రాన్ని మంజూరు చేశారు. ప్రభుత్వ ఆర్థిక సహకారంతో రూ.4 లక్షల పెట్టుబడితో హాలహర్వి మండలం గూళ్యంలో ఈ కేంద్రాన్ని గతేడాది ప్రాంభించా. జొన్న రొట్టెలను తయారు చేసి, ప్యాకింగ్‌ ద్వారా ఎగుమతి చేస్తున్నాం. ఖర్చులు పోను నికరాదాయం మిగులుతోంది. నాతోపాటు మరో ఇద్దరికి ఈ కేంద్రంలో పని కల్పిస్తున్నా. మహిళల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రుణ పడిఉంటాం. – దేవిరెడ్డి విజయలక్ష్మి

>
మరిన్ని వార్తలు