ఆటో నడుపుతున్న మహిళ

5 Dec, 2023 05:28 IST|Sakshi

ఆటో నడుపుతున్న మహిళ

ఈమె పేరు కందోలు బేబి. గోనెగండ్ల మండలం నెరడుప్పల గ్రామానికి చెందిన పొదుపు మహిళ. కుటుంబం పేదరికంతో సతమతం అవుతున్న నేపఽథ్యంలో ౖధైర్యంగా ఆటో ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకోసం మహిళ ఉన్నతి పథకం కింద రూ.50 వేలు లోన్‌ తీసుకున్నారు. బ్యాంకుల నుంచి లింకేజీ రుణం తీసుకున్నారు. సమకూరిన డబ్బుతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆటో ఏర్పాటు చేసుకున్నారు. అనంతపురం జిల్లాలోని ఆర్‌డీటీలో డ్రైవింగ్‌లో శిక్షణ పొంది.. లైసెన్స్‌ పొందారు. ఆరు నెలలుగా ఆటో నడుపుతూ ఉపాధి పొందుతున్నారు. రోజుకు అన్ని ఖర్చులు పోగా రూ. 600–800 ప్రకారం మిగులుతోందని ఈమె చెబుతున్నారు. ఆటో నడపడంలో ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు.

ఆటో నడుపుతున్న ఈమె పేరు రిబికమ్మ. తుగ్గలి మండలం రోళ్లపాడు గ్రామానికి చెందిన మహిళ. గతంలో తీవ్ర పేదరికంతో అనేక ఇబ్బందులు పడ్డారు. అనంతపురం జిల్లాకు చెందిన ఆర్‌డీటీ ద్వారా ఉచితంగా ఆటో మంజూరు చేశారు. నెల రోజుల పాటు డ్రైవింగ్‌లో శిక్షణ పొందిన తర్వాత లైసెన్స్‌ కూడా వచ్చింది. ప్రస్తుతం ఆటోను రోళ్లపాడు నుంచి ప్యాపిలి, జొన్నగిరి గ్రామాల మధ్య ప్రయాణికుల కోసం నడుపుతున్నారు. నెలకు అన్ని ఖర్చులు పోగా.. రూ.12,000 వరకు నికరాదాయం వస్తోంది. ఆటో నడపడంలో ఎలాంటి ఇబ్బంది లేదని ఈమె చెబుతున్నారు.

ఆటో నడుపుతున్న మహిళలు

‘ఉన్నతి’ కింద రుణం మంజూరు

చేస్తున్న ప్రభుత్వం

వడ్డీ లేకుండా 48 కంతుల్లో

చెల్లించే అవకాశం

ఈ నెల 7న 11 మంది మహిళలకు

ఆటోల పంపిణీ

ఉపాధి ‘మార్గం’

జిల్లాలో ఇప్పటికే ముగ్గురు మహిళలు ఆటోలు నడుపుతూ జీవనోపాధి పొందుతున్నారు. డ్రైవింగ్‌ అంటే భయం లేదని నిరూపిస్తున్నారు. గోనెగండ్ల మండలం నెరడుప్పల గ్రామానికి చెందిన బేబి, పెద్దకడుబూరు మండలం కంబలదిన్నె గ్రామానికి చెందిన బోడెమ్మ, తుగ్గలి మండలం రోళ్లపాడు గ్రామానికి చెందిన రిబికమ్మలు ఆటోలు నడుపుతూ... కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. డ్రైవింగ్‌లో ఎలాంటి భయం, ఆందోళన లేకుండా పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. ఇందులో నెరడుప్పల గ్రామానికి చెందిన బేబీకి ఇది వరకే ఆటో మెయిన్‌టెనెన్స్‌, రిపేరీల కోసం ఉన్నతి కింద రూ.50 వేలు రుణ సదుపాయం కల్పించారు. ఈ మొత్తాన్ని రికవరీ చేయడంతో బేబీకి 90 శాతం రుణంపై కొత్త ఆటో మంజూరు చేశారు. మిగిలిన ఇద్దరు మహిళలు అనంతపురం జిల్లాకు చెందిన ఆర్‌డీటీ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆటోలు పొంది ఉపాధి అవకాశాలను అభివృద్ధి చేసుకున్నారు.

>
మరిన్ని వార్తలు