‘సాయుధ’ నిధికి విరాళాలివ్వండి

5 Dec, 2023 05:28 IST|Sakshi
సాయుధ దళాల స్టిక్కర్స్‌, కార్‌గ్లాగ్స్‌ను ఆవిష్కరిస్తున్న జేసీ నారపురెడ్డి మౌర్య

కర్నూలు(అర్బన్‌): సాయుధ దళాల ప్రత్యేక నిధికి ప్రతి ఒక్కరూ విరాళాలు అందించాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నారపురెడ్డి మౌర్య పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో త్రివిధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా సాయుధ దళాల పతాక స్టిక్కర్స్‌, కార్‌ గ్లాగ్స్‌ను జేసీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ దేశ భద్రతలో త్రివిధ దళాల సేవలు కీలకమన్నారు. ప్రతి ఏడాది డిసెంబర్‌లో దేశ వ్యాప్తంగా సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. యుద్ధంలో మృతి చెందిన, పదవీ విరమణ చేసిన జవానుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ మధుసూదన్‌రావు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రమ, నాగప్రసన్న లక్ష్మి, జిల్లా సైనిక్‌ వెల్ఫేర్‌ అధికారి రత్నరూత్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

జేసీ నారపురెడ్డి మౌర్య

>
మరిన్ని వార్తలు