మా బడి చాలా బాగుంది

5 Dec, 2023 05:28 IST|Sakshi

నేను 20 ఏళ్లుగా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నా. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు ఉండేవి కాదు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడేవారు. మద్దికెర మండలం పెరవలి ప్రాథమిక ఆదర్శ పాఠశాలలో గతంలో మంచినీరు దొరికేవి కాదు. చుట్టుపక్కల వారి దగ్గరి కెళ్లి అడిగి తెచ్చుకుని దాహం తీర్చుకోవాల్సి వచ్చేది. మధ్యాహ్న భోజన సమయంలో మరింత కష్టంగా ఉండేది. విద్యార్థులు పుస్తకాల సంచితో పాటు వాటర్‌ బాటిల్‌ కూడా బరువుగా మోసేవారు. ప్రస్తుతం ఈ కష్టాలు తొలగాయి. రాష్ట్ర ప్రభుత్వం రూ.1.60 లక్షలతో పాఠశాలలో శుద్ధజల ప్లాంటును ఏర్పాటు చేసింది. విద్యార్థులకు ఫిల్టర్‌ వాటర్‌ అందిస్తున్నాం. అంతేగాక తరగతి గదులను అందంగా తీర్చిదిద్ది, బెంచీలు ఏర్పాటు చేశారు. మా బడి చాలా బాగుపడింది.

– లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయుడు

>
మరిన్ని వార్తలు