ఈరన్నస్వామికి బంగారు గాజుల విరాళం

5 Dec, 2023 05:30 IST|Sakshi

కౌతాళం: ఉరుకుంద ఈరన్న స్వామికి సోమవారం కర్నూలు నగరానికి చెందిన చక్రపాణి, అతని కుటుంబ సభ్యులు 39.4 గ్రాముల బంగారు గాజులను దేవాలయ కార్యాలయంలో అందజేశారు. దాతలకు ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు, జ్ఞాపికను బహూకరించారు. కార్యక్రమంలో సీనియర్‌ అసిస్టెంట్‌ కిరణ్‌కుమార్‌, ట్రస్టుబోర్డు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

కేసీలో వ్యక్తి గల్లంతు

కర్నూలు: నగరంలోని ధర్మపేటకు చెందిన గౌండా పాల్‌ (46) కేసీ కెనాల్‌లో గల్లంతయ్యాడు. సోమవారం మధ్యాహ్నం ధర్మపేటకు చెందిన శిరీష కెనాల్‌ ఒడ్డున బట్టలు ఉతుకుతూ ప్రమాదవశాత్తు జారి కాలువలో పడింది. అక్కడే ఉన్న పాల్‌తో పాటు మరికొందరు కలసి ఆమెను బయటకు తీసి కాపాడారు. అయితే పాల్‌ నీటిలో మునిగి కనిపించకపోవడంతో అక్కడున్న యువకులు చాలాసేపు గాలించినా కనిపించలేదు. ఈయన గౌండా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. విషయం తెలిసిన వెంటనే రెండో పట్టణ పోలీసులు అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. బంధువులు కూడా కేసీ కెనాల్‌ వెంట గాలించినా ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు