అల్జీమర్స్‌కు ప్రధాన ముప్పు..పెరిగే వయసు!

28 Feb, 2021 08:08 IST|Sakshi

వయసు పైబడిన దశలో జ్ఞాపకశక్తి కొంత మందగించడం సహజమే. కానీ  అల్జీమర్స్‌ లక్షణాలైన రోజువారీ జీవితాన్ని గందరగోళపరచగల మతిమరపు, దిక్కు తోచనిస్థితిలో చిక్కుకోవడం వంటివి వృద్ధాప్యం వల్లనే వచ్చేవి కావు. తాళం చేతులు ఎక్కడో పెట్టి మరచిపోవడం సాధారణ మతిమరపు లక్షణమే. అయితే వాహనం నడిపే విధానాన్నే మరిచిపోవడం, దశాబ్దాలుగా తిరుగుతున్న వీధుల్లో దారితప్పిపోవడం వంటివి వృద్ధాప్యపు మతిమరపు కానేకాదు. ఈ రకమైన జ్ఞాపకశక్తి క్షీణత ప్రమాదకరం. వృద్ధాప్యం వల్ల వచ్చే కొద్దిపాటి మతిమరపునకూ,  అల్జీమర్స్‌‌కూ చాలా తేడా ఉంటుంది. ఇది మెదడులో జరిగే మార్పులు, మెదడును దెబ్బతీసే పరిణామాల కారణంగా వస్తుంది. వ్యాధి ముదిరిన కొద్దీ ఆలోచించడం, తినడం, మాట్లాడటం వంటి సాధారణ, సహజ సామర్థ్యాలను కోల్పోతారు. వృద్ధాప్యం లక్షణాలు  అల్జీమర్స్‌ కాదు.

కానీ వయసు పైబడిన కొందరిలో అనివార్యంగా వస్తున్న వ్యాధి  అల్జీమర్స్‌‌. ప్రస్తుతానికి  అల్జీమర్స్‌‌ను పూర్తిగా తగ్గించే మందులు లేకపోయినా... లక్షణాలు కనిపించినప్పుడు వ్యాధిని సాధ్యమైనంత ఆలస్యం చేసే మందులు ఉన్నాయి. అయితే  అల్జీమర్స్‌‌ను నివారించడానికి మెదడును ఉపయోగించి పరిష్కరించగలిగే పజిల్స్, సుడోకూ వంటి మెదడుకు మేత వ్యాయామాలతో దాన్ని చాలావరకు నివారించవచ్చు.  

మరిన్ని వార్తలు