మెడమీద ముడతలు తగ్గాలంటే..

9 Jan, 2021 13:22 IST|Sakshi

ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు క్లెన్సింగ్‌ మిల్క్‌లో ముంచిన కాటన్‌తో మెడను తుడిచి, ఆ తర్వాత టీ స్పూన్‌ కీరా దోసకాయ రసంలో టీ స్పూన్‌ ఆపిల్‌ వెనిగర్‌ కలిపిన మిశ్రమాన్ని మెడకు పట్టించాలి. ఉదయం చన్నీటితో కడిగేయాలి. ఇలా కనీసం మూడు వారాల పాటు చేస్తే క్రమంగా మెడ మీద నలుపు వదులుతుంది. ఆపిల్‌ వెనిగర్‌ చర్మాన్ని టైట్‌ చేస్తుంది, కీరదోస చర్మాన్ని కోమలంగా మారుస్తుంది.
⇔ ప్రతి రోజూ ఒంటికి మాయిశ్చరైజర్, బాదం ఆయిల్‌ లేదా నువ్వుల నూనె రాస్తుంటే చర్మం చలికి పొడిబారకుండా ఉంటుంది.
⇔ శీతాకాలంలో చేతులకు ఆయిల్‌తో మర్దన చేయడం వల్ల ముడతలు తగ్గి చేతివేళ్ళు అందంగా తయారవుతాయి. 
⇔ చలికాలంలో పెదవులు పగులుతుంటే... రాత్రి పడుకోబోయే ముందు నెయ్యి, వెన్న, మరేదైనానూనె రాస్తే పెదవులు మృదువుగా ఉంటాయి. బయటకు వెళ్లేటప్పుడు జెల్‌ వంటివి రాసుకోవచ్చు.

మరిన్ని వార్తలు