ఇవి పాటిస్తే కీళ్ళనొప్పులుండవు!

18 Mar, 2021 14:04 IST|Sakshi

కేవలం ఆహార నియమాలతోనే మనం ఆర్థరైటిస్‌ను తగ్గించలేము. తీసుకునే ఆహారంతోనే అరిగిపోయిన కార్టిలేజ్‌ను పునరుద్ధరించలేము. అయితే శరీరం బరువు పెరగకుండా ఉండటానికి స్థూలకాయాన్ని తగ్గించుకునేందుకు ఆహారనియమాలు ఉపయోగపడతాయి. అలాగే ఆర్థరైటిస్‌ రాకముందే పాలు, తగినంత క్యాల్షియమ్‌ ఉండే ఆహారం వల్ల దీర్ఘకాలం పాటు దాని నివారణ సాధ్యం కావచ్చు. ఆహార నియమాలు పాటించడం ద్వారా ఆర్థరైటిస్‌ను చాలావరకు నివారించవచ్చు. అలాగే రోగ్యకరమైన జీవనశైలి పాటించడం ద్వారా కూడా ఆర్థరైటిస్‌ దుష్ప్రభావాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. మన జీవనశైలి వల్ల మన కీళ్లపై చాలా ప్రభావం పడుతుంది.

ఉదాహరణకు మన శరీరంలో తగినన్ని కదలికలు ఉండటం వల్ల మన కార్టిలేజ్, కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అయితే అవి మరీ ఎక్కువగా అరిగిపోయేలా మన కదలికలు ఉండదకూడదు. అంటే... కదలికలు మరీ తక్కువగా ఉండటం, మరీ ఎక్కువగా ఉండటం... ఇవి రెండూ ప్రమాదకరమే అని గుర్తించాలి.

చదవండి: ఆహ్లాదానికి... ఆరోగ్యానికి మల్లె 

మరిన్ని వార్తలు