గ్రంథాలయ వారోత్సవాలు

17 Nov, 2023 01:20 IST|Sakshi
పుస్తక ప్రదర్శనను ప్రారంభిస్తున్న ప్రిన్సిపాల్‌ రాజు

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లా కేంద్రంలోని నూకల రామచంద్రారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ రాజు మాట్లాడుతూ.. పుస్తకం హస్తభూషణం అని, మానవ వికాసానికి తోడ్పడుతుందన్నారు. విద్యార్థులు పుస్తక పఠనం అలవాటు చేసుకుని జీవితంలో ఎదగాలన్నారు. వారంపాటు పుస్తక ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సి పాల్‌ మమత, లైబ్రేరియన్‌ చిత్తనూరి మల్లేశం, అధ్యాపకులు యుగంధర్‌, బొంద్యాలు, వేణుగోపా ల్‌, రామరత్నమాల, వెంకటేశ్వర్లు, రాజేందర్‌, రాంరెడ్డి, నరహరి, సుజిత్‌ రెడ్డి, శశికాంత్‌, కాసిం, హథీ రాం, సంతోష్‌ కుమార్‌, వీరు, సుమలత, రవితేజ, ఉపేందర్‌, రఘురాం, రామన్న, ప్రశాంత్‌ తదిత రులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు