కాంగ్రెస్‌కు ఓటు వేస్తే భవిష్యత్‌ ఆగమే..

25 Nov, 2023 01:18 IST|Sakshi
కామేపల్లి : ప్రచారంలో మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బానోత్‌ హరిప్రియ, నాయకులు

కామేపల్లి: కాంగ్రెస్‌ పార్టీకి గ్యారంటీ, వారంటీ లేదని.. ఆ పార్టీ నాయకులు చెప్పే మాయమాటలు నమ్మి ఓటు వేస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని ఇల్లెందు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బానోతు హరిప్రియ వెల్లడించారు. ఈ విషయాన్ని గుర్తించి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన తనను ప్రజలు మరోసారి గెలిపించాలని కోరారు. కామేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం చేసిన ఆమె మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పాలనలోనే రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. నియోజకవర్గంలో గత 60 ఏళ్లలో జరగని అభివృద్ధి బీఆర్‌ఎస్‌ పాలనలో చేసి చూపించానని తెలిపారు. బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ధనియాకుల హన్మంతరావు, నాయకులు తీర్థాల చిదంబరరావు, బోడేపూడి అనురాధ, గుంపెనపల్లి అనంతరాములు, మూడ్‌ దుర్గాజ్యోతి, జాటోత్‌ జాయ్‌లూసీ, మూడ్‌ కృష్ణప్రసాద్‌నాయక్‌, బోడేపూడి వీరప్రతాప్‌, వడియాల కృష్ణారెడ్డి, కొమ్మినేని శ్రీనివాసరావు, చల్లా హరి, ఆంతోటి అచ్చయ్య, అజ్మీరా రాజు, తూము బాబు, చల్లా నాగేంద్రబాబు, దండగల దేవేందర్‌, భట్టు శంకర్‌, కేలోత్‌ భాస్కర్‌, కొనకంచి శంకర్‌, ఉప్పుగండ్ల వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి

గార్ల/టేకులపల్లి: మండలంలో చేసిన అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించాలని ఇల్లెందు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బానోత్‌ హరిప్రియ కోరారు. గార్ల మండలంలోని పలు గ్రామాలకు చెందిన నాయకులు హరిప్రియ సమక్షాన బీఆర్‌ఎస్‌లో చేరారు. నాయకులు లింగాల ఉమేష్‌, రమేష్‌, మోతీలాల్‌, తదితరులు పాల్గొన్నారు. ఇక టేకులపల్లి మండలం మంగ్యాతండాకు చెందిన పలువురు కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌లో బానోతు శంకర్‌ ఆధ్వర్యాన చేరగా వారిని హరిప్రియ ఆహ్వానించారు.

విస్తృత ప్రచారం

ఇల్లెందు/ఇల్లెందురూరల్‌/టేకులపల్లి: బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బానోతు హరిప్రియను గెలిపించాలని కోరుతూ ఇల్లెందులో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ మడత రమ, మడత వెంకట్‌గౌడ్‌ ప్రచారం చేశారు. దివ్యాంగుల ఆధ్వర్యాన హరిప్రియకు మద్దతుగా ర్యాలీ నిర్వహించగా వెంకట్‌ మాట్లాడారు. కౌన్సిలర్‌ కొండపల్లి సరిత, నాయకులు రవినాయక్‌, కోటేశ్వరరావు, నారాయణ, శ్రీనివాసరెడ్డి, సారిక పాల్గొన్నారు. గ్రామాల్లో హరిప్రియను గెలుపు కోరుతూ వైస్‌ ఎంపీపీ దాస్యం ప్రమోద్‌తో పాటు యాకూబీ, ఘాజీ, యాకయ్య టేకులపల్లి మండలంలోని గ్రామాల్లో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు వరప్రసాద్‌, బాలు ఆధ్వర్యాన ప్రచారం చేశారు.

ఇల్లెందు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి హరిప్రియ

మరిన్ని వార్తలు