జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): మహబూబ్‌నగర్‌ను మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో 42 మందికి రూ.31లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. ఏదైనా అత్యవసర వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి నుంచి స్థానికంగానే అన్ని రకాల వైద్య సేవలు అందుబాటలోకి వచ్చేలా చేశామన్నారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఆక్సిజన్ ఉత్పత్తి చేసే విధంగా ప్లాంటు, నిల్వకు ఏర్పాట్లు చేశామన్నారు. రూ.500కోట్లతో పాత కలెక్టరేట్ ఆవరణలో నిర్మిస్తున్న వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో క్యాన్సర్ స్క్రీనింగ్, గుండె మార్పిడి చికిత్సలు, అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రహెమాన్, వైస్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మంత్రి శ్రీనివాస్‌గౌడ్