సరిహద్దులో ‘చెక్‌’పోస్టులు

18 Mar, 2023 01:40 IST|Sakshi
వీసీలో మాట్లాడుతున్న నారాయణపేట కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

నారాయణపేట: వచ్చే కర్ణాటక శాసనసభ సాధారణ ఎన్నికలు 2023ను దృష్టిలో పెట్టుకొని సరిహద్దు చెక్‌ పోస్టులను పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందని నారాయణపేట కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సూచించారు. శుక్రవారం గూగూల్‌ మెట్‌ ద్వారా కర్ణాటకలోనియాద్గీర్‌ జిల్లా, నారాయణపేట జిల్లా కలెక్టర్‌, ఎస్పీలు ఇంటర్‌ స్టేట్‌ బోర్డర్‌ సమావేశం నిర్వహించగా యాద్గీర్‌ జిల్లా నుంచి కలెక్టర్‌ ఆర్‌.స్నేహ, ఎస్పీ వేదమూర్తి పాల్గొన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి జిల్లాల పరిసరాలలో జరిగే మద్యం రవాణా, రోడ్డు ప్రమాదాలు, ఇంటర్‌ స్టేట్‌గ్యాంగ్స్‌, దొంగతనాలు, అక్రమంగా గుట్కా రవాణా, పీడీఎస్‌ రైస్‌, ఇసుక మాఫియా, చైన్‌ స్నాచింగ్‌ గ్యాగ్స్‌లను అరికట్టడంపై చర్చించారు. ఇంటర్‌ బోర్డు చెక్‌ పోస్టులను పకడ్బందీగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని గుర్తించారు. కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సందర్భంగా నారాయణపేట జిల్లాలో బంగారం, చీరలు కర్ణాటకకు అధిక మొత్తంలో రవాణా చేసినట్లు గుర్తిస్తే తమకు తెలపాలని యాద్గీర్‌ జిల్లా కలెక్టర్‌ కోరారు. జిల్లాకు క్రిష్ణ, జలాల్‌పూర్‌, కానుకుర్తి, ఎక్లాస్‌పూర్‌ బోర్డర్‌ చెక్‌పోస్టులు ఏర్పాటు పై జిల్లా పోలీస్‌ అధికారులు చర్చించారు. ఇరు జిల్లా అధికారులు సమన్వయంతో కలసి పనిచేసి అక్రమ రవాణ నియంత్రణ కోసం మరింత పటిష్ట చర్యలు తీసుకోవాలని అవగాహనకు వచ్చారు. అదేవిధంగా ఇంటర్‌ స్టేట్‌ బోర్డర్‌ అధికారులు సంయుక్తంగా వాట్సప్‌ స్టేట్‌ బోర్డర్‌ అధికారులు సంయుక్తంగా వాట్సప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసుకొని సమాచార మార్పిడి ఎప్పటికప్పుడు ఇచ్చి పుచ్చుకోవాలని తెలిపారు. జిల్లాలకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్న వాట్సప్‌లో సమాచారం ఇవ్వాలని అధికారులకు తెలిపారు. సమావేశంలో నారాయణపేట ఎస్పీ ఎన్‌.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

వీసీలో యాద్గీర్‌, పేట జిల్లాల కలెక్టర్లు

మరిన్ని వార్తలు