ఆదర్శ వివాహం

18 Mar, 2023 01:40 IST|Sakshi
పెద్దల సమక్షంలో ఒక్కటైన నర్సింహులు, రాజేశ్వరి

హన్వాడ: వారిద్దరూ పుట్టుకతోనే మూగ. ఒకే కళాశాలలో కలిసి చదువుకుంటూ ప్రేమలో పడ్డారు. ఇరువురి కులాలు వేరైనప్పటికీ పెద్దలను ఒప్పించి శుక్రవారం పెద్దల సమక్షంలో ఒక్కటై పలువురికి ఆదర్శంగా నిలిచారు. వివరాల్లోకి వెళితే. మండలంలోని టంకర గ్రామానికి చెందిన ఫకీరయ్య, పద్మమ్మ దంపతులకు రాజేశ్వరి ఒక్కగానొక్క కుమార్తె. పుట్టుక నుంచి మూగ అయినప్పటికీ తల్లిదండ్రులు అందరితో సమానంగా చదివించారు. హైదరాబాద్‌లోని బదిరుల కళాశాలలో ఇంటర్‌ సీఈసీలో చేర్పించారు. ఈ క్రమంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడెంకు చెందిన నర్సింహులు పరిచమయ్యాడు. ఇద్దరిదీ ఒకే కళాశాలలో కావడంతో వారి మనుసులు కలిశాయి. ఇద్దరూ పుట్టు మూగకావడం విశేషం. ఒకరి అభిరుచులు ఒకరికి నచ్చడంతో ప్రేమలో పడ్డారు. ఇద్దరూ బీకాం, డిగ్రీ పూర్తి కాగా నర్సింహులు వస్త్ర షోరూంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అబ్బాయి తల్లి దండ్రులు వీరమల్ల ముత్యాలమ్మ, నిరంజన్‌లకు తమ ప్రేమ విషయాన్ని తెలపడంతో వారు సైతం పెళ్లికి అడ్డుచెప్పకుండా ఒప్పుకున్నారు. ప్రేమ పెళ్లిళ్లకు కుల పంచాయతీలు అడ్డు తగులుతున్న ప్రస్తుత తరుణంలో ఇరువురి కుటుంబీకులు సైతం అంగీకారం తెలిపారు.

మరిన్ని వార్తలు