మళ్లీ బుసలు కొడుతున్న కరోనా వైరస్...

21 Mar, 2023 01:58 IST|Sakshi

పాలమూరు: ప్రజలను రెండేళ్ల పాటు ముప్పు తిప్పలు పెట్టి.. ఆర్థికంగా ఎంతో నష్టం చేకూర్చిన కరోనా మళ్లీ కోరలు చాచుతుందా అనే సందేహాలు వ్య క్తమవుతున్నాయి. కరోనా పలు ద శలుగా మార్చుకొని విస్తరిస్తోంది. కొత్తగా వ్యాప్తి చెందుతున్న వైరస్‌తో చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతిఒక్కరికి దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొ ప్పిసమస్యలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా కరోనా కే సుల పెరుగుదల అధికంగా లేనప్పటికీ.. ముందు జా గ్రత్త చర్యలు తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లుయెంజా హెచ్‌ 3 ఎన్‌2తో విస్తరిస్తోందని, ప్రతిఒక్కరు మాస్కులు ధరించడం, శుభ్రత పాటించాలని చెబుతున్నారు.

822 మందికి పరీక్షలు
జిల్లాలో పది రోజులుగా 164 ఆర్టీపీసీఆర్‌, 658 మందికి ర్యాట్‌ పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో చేసిన పరీక్షల్లో 13 మంది కరోనా పాజిటి వ్‌ నిర్ధారణ అయింది. ఇందులో నలుగురు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉండగా మరో 9 మంది ఇంటి దగ్గర ఐసోలేషన్‌లో ఉంటున్నారు. ప్రస్తుతం జనరల్‌ ఆస్పత్రిలో 500 పడకలు ఆక్సిజన్‌ పడకలతోపాటు 80 ఐసోలేషన్‌ బెడ్లు అందుబాటులో పెట్టారు. దీంతోపాటు రెండు ఆక్సిజన్‌ ట్యాంకర్స్‌, కావాల్సిన పరికరాలు సిద్ధం చేసుకోవడం జరిగింది.

వీరు జాగ్రత్తగా ఉండాలి
కొత్త వేరియంట్‌తో భయపడాల్సిన అవసరం లేదు. అయితే అజాగ్రత్తగా మాత్రం ఉండొద్దు. ముఖ్యంగా కరోనా తర్వాత వచ్చే అనారోగ్య సమస్యలు కొందరిపై తీవ్ర దుష్ప్రభావం చూపుతున్నాయి. కొత్త రకం వైరస్‌ పట్ల దీర్ఘకాలిక రోగులు, పెద్ద వయస్సు వారు, పిల్లలు, గర్భిణులు, అవయవ మార్పిడి చేసుకున్నవారు అప్రమత్తంగా ఉండాలని, జనంలోకి వెళ్తే తప్పకుండా మాస్క్‌లు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.

పరీక్షలు చేస్తున్నాం..
ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వైరస్‌లో దగ్గు, జలుబు, జ్వరంతోపాటు కడుపు నొప్పి, వాంతులు, తలనొప్పి, మోషన్స్‌ వంటి లక్షణాలు అధికంగా ఉంటున్నాయి. ఎవరూ కూడా పరిస్థితి విషమించే వరకు నిర్లక్ష్యం చేయరాదు. ఏదైనా లక్షణాలు ఉంటే పరీక్షలు చేసుకోవడం లేదా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుడి దగ్గర చికిత్స తీసుకోవడం మంచిది. ప్రస్తుతం రద్దీ సీజన్‌ వల్ల పెళ్లిళ్లు, జాతరలు అధికంగా ఉన్నాయి. ప్రతిఒక్కరూ మాస్క్‌ ధరించడంతోపాటు చేతులు శుభ్రంగా పెట్టుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రిలో చాలా వరకు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేస్తున్నాం. అత్యవసరమైన వారికి మాత్రమే ర్యాటీ పరీక్షలు చేస్తున్నాం.

– రామకిషన్‌, జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌

మరిన్ని వార్తలు