ఎన్నికల సాధారణ పరిశీలకుడి నియామకం

11 Nov, 2023 01:30 IST|Sakshi
సంజయ్‌కుమార్‌మిశ్రాకు మొక్క అందజేస్తున్న కలెక్టర్‌ రవినాయక్‌, ఎస్పీ హర్షవర్ధన్‌

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఐఏఎస్‌ అధికారి సంజయ్‌కుమార్‌మిశ్రాను కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా సాధారణ పరిశీలకులుగా నియమించింది. ఈ మేరకు సంజయ్‌కుమార్‌మిశ్రా గురువారం రాత్రి జిల్లాకు చేరుకున్నారు. 2011 బ్యాచ్‌కు చెందిన సంజయ్‌కుమార్‌మిశ్రా మహబూబ్‌నగర్‌–74, జడ్చర్ల–75, దేవరకద్ర–76 అసెంబ్లీ నియోజకవర్గాలకు సాధారణ పరిశీలకులుగా వ్యవహరిస్తారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులను పరిశీలకులు సంజయ్‌కుమార్‌మిశ్రా ఫోన్‌ నంబర్‌ 8522875618కు చేయవచ్చు.

● ఎన్నికల సాధారణ పరిశీలకుడు సంజయ్‌కుమార్‌మిశ్రాను కలెక్టర్‌ రవినాయక్‌, ఎస్పీ హర్షవర్ధన్‌ జిల్లాకేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.

● ఎన్నికల సాధారణ పరిశీలకుడు సంజయ్‌కుమార్‌మిశ్రా శుక్రవారం మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలోని కంట్రోల్‌ రూం, పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రాన్ని పరిశీలించారు. అలాగే బాలికల జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గ ఈవీఎంల తాత్కాలిక స్ట్రాంగ్‌ రూంను, రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో కంట్రోల్‌ రూంను ఫెసిలిటేషన్‌ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం జడ్చర్ల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలోని కంట్రోల్‌ రూంను ఫెసిలిటేషన్‌ కేంద్రాన్ని సందర్శించారు.

మరిన్ని వార్తలు